Kurchi Madathapetti : ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్‌లో ఇంతుందా మీనింగ్.. చంద్రబాబుతో పోలుస్తూ ఏమన్నా చెప్పిందా..

'కుర్చీ మడతబెట్టి' సాంగ్‌లోని లిరిక్స్ తో చంద్రబాబుతో పోలుస్తూ చెప్పిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 12:35 PM IST

Kurchi Madathapetti : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘గుంటూరు కారం’. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకుంది. అయితే ఈ మూవీలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ అయితే గ్లోబల్ లెవెల్ లో పాపులర్ అవుతుంది. ఈ పాటకి మహేష్ అండ్ శ్రీలీల వేసిన స్టెప్పులు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తున్నాయి.

అయితే ఇన్నాళ్లు ఈ పాటలోని రిథమ్స్ నే ఎంజాయ్ చేస్తూ వస్తున్న ఆడియన్స్‌కి.. ఈ సాంగ్ లోని లిరిక్స్ అర్ధాన్ని తెలియజేసారు టీడీపీ చెందిన ఓ మహిళ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఏపీలో పొలిటికల్ ప్రచారాల జోరు ఎక్కువైంది. ఇక ఈ ప్రచారాల్లో భాగంగా.. టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ కి సంబంధించిన తేజస్వి అనే మహిళ కుర్చీ మడతపెట్టి సాంగ్ లోని లిరిక్స్ మీనింగ్ ని చంద్రబాబుతో పోలుస్తూ చెప్పుకొచ్చారు.

“దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి. మేకలేమో.. వందలు పెరిగిపోయే, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటకు కరిగిపాయే” అనే లిరిక్స్ మీనింగ్ చెబుతూ.. మేకలు ఇస్తే అవి వందలుగా పెరిగి ఆమె సంపాదించుకుంది. కానీ నూకలు తీసుకున్న ఆమె.. ఒక పూటలో మొత్తం కరిగిపోవడంతో మళ్ళీ నూకలు కోసం చెయ్యి చాచాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు కూడా ఈ నూకలు లాంటివి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ఆలోచన చాలా తక్కువమందికి అర్ధమవుతుంది. ఒక వ్యక్తిని చదివించి, ఉద్యోగం కల్పిస్తే.. అతడి కుటుంబం నుంచి పేదరికం నుంచి బయటపడింది అనేది చంద్రబాబు ఆలోచన. అంతేగాని ఏదో ఒక పూటకి సంక్షేమ పథకం ఇచ్చేస్తే చాలు అనుకోరు. అభివృద్ధిని, సంక్షేమని సమపాలనలో చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Also read : Navy Chief Dinesh Tripathi: భారత నౌకాదళ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి.. ఎవ‌రీ త్రిపాఠి..?