Site icon HashtagU Telugu

Chandrababu : కుప్పంలో కొన‌సాగుతున్న హైటెన్ష‌న్‌.. చివ‌రి రోజు ప‌ర్య‌ట‌న‌కు రెఢీ అవుతున్న బాబు

Babu Kuppam

Babu Kuppam

నేటితో చంద్రబాబు కుప్పం ప‌ర్య‌ట‌న ముగియ‌నుంది. ఈ నేపథ్యంలో కుప్పంలో హైటెన్షన్ కొనసాగుతోంది. షెడ్యూల్‌లో భాగంగా గుడిపల్లిలో చంద్ర‌బాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. దీని కోసం పార్టీ క్యాడర్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే మైక్ అనుమతిపై పోలీసులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు అనుమతి లేకపోయినా రోడ్‌షోలో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు గుడిపల్లి నుంచి రోడ్‌షో ప్రారంభం కానుంది. కర్ణాటక సరిహద్దులోని పెద్దపర్తి కుంట వరకు పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. కాగా అనుమతి కోరుతూ నిన్న డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. డీజీపీకి పంపిన నాలుగు పేజీల లేఖలో కుప్పం పర్యటనలో జరిగిన పరిణామాలతో పాటు పోలీసుల తీరును చంద్ర‌బాబు నాయుడు వివరించారు. ప్రచార రథానికి అనుమతితో పాటు పలు అంశాలను లేఖలో ప్రస్తావించారు. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో గాయపడిన కార్యకర్తలను గురువారం కుప్పంలో టీడీపీ అధినేత కలిశారు. పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని బాధితులు ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. కుప్పంలో దాదాపు 1500 మంది పోలీసులు మోహరించి కార్యకర్తలపై దాడి చేశారని చంద్ర‌బాబు ఆరోపించారు.

Exit mobile version