Site icon HashtagU Telugu

TDP Political Action Committee : టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ రెడీ.. ఇక యుద్ధమే..

Tdp Political Action Committee Announced by Atchennaidu

Tdp Political Action Committee Announced by Atchennaidu

ఏపీ రాజకీయాలు(AP Politics) రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) తర్వాత ఏపీ రాజకీయం రోజుకో రకంగా మారుతుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా టీడీపీ(TDP)తో కలవడంతో వైసీపీ నాయకులు వరుసగా టీడీపీ జనసేన(Janasena) పార్టీలపై ఫైర్ అవుతున్నారు. అటు చంద్రబాబు అరెస్ట్ నిరసనగా ఎక్కడికక్కడా నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.

మరో పక్క కొన్ని నెలల్లో ఎలక్షన్స్ ఉండటంతో చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని, దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇక చంద్రబాబు జైలు నుంచే వ్యూహాలు వేస్తున్నారు. తాజాగా టీడీపీ నాయకులు చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ప్రకటించారు.

టీడీపీ నేత అచ్చెన్నాయుడు(Atchannaidu) నేడు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని(TDP Political Action Committee) ఏర్పాటు చేసినట్టు తెలిపాడు. 14 మంది సభ్యులతో ఈ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించారు. అచ్చెన్నాయుడు ప్రెస్ తో మాట్లాడుతూ.. ఆ 14 మంది పేర్లను ప్రకటించారు.

టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఉన్న 14 మంది వీరే..

యనమల రామకృష్ణుడు
కింజరపు అచ్చెన్నాయుడు
చింతకాయల అయ్యన్నపాత్రుడు
MA షరీఫ్
పయ్యావుల కేశవ్
నందమూరి బాలకృష్ణ
నారా లోకేష్
నిమ్మల రామానాయుడు
నక్కా ఆనంద్ బాబు
కాలువ శ్రీనివాసులు
కొల్లు రవీంద్ర
బిసి జనార్దన్ రెడ్డి
వంగలపూడి అనిత
బీదా రవిచంద్ర యాదవ్

ఇక ఈ 14 మంది పొలిటికల్ యాక్షన్ కమిటీ ఓ పక్క చంద్రబాబు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరో పక్క ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.