TDP Plan : గృహ‌సార‌థుల‌కు పోటీగా సాధికార సార‌థులు! చంద్ర‌బాబు ప్ర‌ణాళిక.!

తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబునాయుడు(TDP Plan) అధికారంలోకి

  • Written By:
  • Updated On - February 16, 2023 / 04:26 PM IST

తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబునాయుడు(TDP Plan) అధికారంలోకి రావ‌డానికి వినూత్న వ్యూహాన్ని క్యాడ‌ర్ కు అందించారు. ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక సాధికార సార‌థిని(Ground team) నియ‌మించేలా దిశానిర్దేశం చేశారు. పార్టీలోని వివిధ విభాగాల ఇంచార్జిలు ఈ ప‌దవుల‌ను తీసుకోవాల‌ని సూచించారు. గ్రామ, జ‌న్మభూమి క‌మిటీలు అధికారంలో ఉన్న‌ప్పుడు ఉండేవి. వాటిని బేస్ చేసుకుని వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్రియేట్ చేశారు. ఈసారి ఎన్నిక‌ల్లో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌, గృహ సార‌థుల‌తో `మ‌రో ఛాన్స్` కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే, చంద్ర‌బాబు సాధికార సార‌థుల‌ను త‌యారు చేయ‌డానికి సిద్ద‌మ‌య్యారు.

తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబునాయుడు(TDP Plan)

తెలుగుదేశం పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌ను చంద్ర‌బాబు(TDP Plan) చేస్తున్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సార‌థ్యంలో పార్టీ న‌డిచిన‌ప్పుడు కూడా క్షేత్ర‌స్థాయి నిర్మాణం ఆయ‌న చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు మ‌రింత ప‌టిష్టంగా నిర్మాణం చేయాల‌ని చంద్ర‌బాబు స‌రికొత్త‌గా సాధికార సార‌థి(Ground team) ప‌దవుల‌ను క్రియేట్ చేశారు. ఏపీలోని 25 పార్ల‌మెంట్ల‌ను యూనిట్ గా తీసుకుని అధ్య‌క్షుల‌ను ఏడాదిన్న‌ర క్రితం నియ‌మించారు. కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల వారీగా కాకుండా పార్ల‌మెంట్ ను యూనిట్ గా తీసుకున్నారు. ప్ర‌తి రెండు పార్ల‌మెంట్ల‌కు ఒక కో ఆర్డినేట‌ర్ ఉన్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, మండ‌ల‌, గ్రామ, బూత్ స్థాయి టీమ్ లు ఉన్నాయి. బూత్ స్థాయిలోని ఇంచార్జిలు అంద‌రూ ఇప్పుడు సాధికార సార‌థులుగా ఉంటారు.

Also Read : CBN Tour : `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` మ‌ళ్లీ మొద‌లు! తూ.గో జిల్లాకు చంద్ర‌బాబు!

తెలుగుదేశం పార్టీకి ప్ర‌జానుకూలం ఉంద‌ని తాజా స‌ర్వేల సారాంశం. అందుకు అనుగుణంగా పోలింగ్ రోజున పార్టీ ప‌నిచేయాల‌ని (Ground team) ప్లాన్ చేస్తోంది. క‌నీసం 160 స్థానాలకు త‌గ్గ‌కుండా గెలవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే స‌ర్వేల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ప్రజాగ్ర‌హం ఉంద‌ని రాబిన్ సింగ్ ఇచ్చిన స‌ర్వేల్లోని సారాంశంగా టీడీపీ చెబుతోంది. రాబోవు రోజుల్లో మ‌రింత వ్య‌తిరేక‌త జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మీద వ‌స్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా `ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ద్వారా వ‌స్తోన్న జనాన్ని టీడీపీ చూపిస్తోంది. ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా ప‌ర్యట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు రోడ్ షోల‌కు ప్ర‌జా ప్ర‌భంజ‌నం క‌నిపిస్తోంది. గ‌తంలోనూ గుంటూరు, కందుకూరు, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోనూ తండోప‌తండాలు ఆయ‌న స‌భ‌ల‌కు ఎగ‌బ‌డ్డారు. ఇదంతా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద పాల‌న మీద జ‌నం విసిగిపోయార‌ని చెప్ప‌డానికి సంకేతంగా ఉందని టీడీపీ భావిస్తోంది.

ప్ర‌తి 50 కుటుంబాల‌కు ఒక సాధికార సార‌థిని  నియ‌మించేలా..

జ‌నంలో ఉన్న ఆద‌ర‌ణ‌ను పోలింగ్ రోజున ఓటుగా మ‌లుచుకోవ‌డానికి సాధికార సార‌థులు(Ground team) ప‌నిచేసేలా చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు. ఇప్ప‌టి నుంచే ఓట‌ర్ల‌తో స‌న్నిహితంగా మెల‌గాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ ప‌రంగా ప‌డుతోన్న బాధ‌ల‌ను తెలుసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు. అంతేకాదు, ఓట‌ర్ల లిస్ట్ ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేస్తూ తొల‌గించిన ఓట‌ర్ల‌ను తిరిగి చేర్పించాల‌ని వివ‌రించారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోని హార్డ్ కోర్ టీడీపీ ఓట‌ర్ల‌ను వైసీపీ తొల‌గించింది. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ కు మాజీ మంత్రి దేవినేని ఉమ ఫిర్యాదు కూడా చేశారు. అందుకే, ఓట‌ర్ల జాబితాను ప‌రిశీలించడం ద్వారా తొల‌గించిన ఓట‌ర్ల‌ను మ‌ళ్లీ జాబితాలోకి ఎక్కించేలా ప‌నిచేయాల‌ని సాధికార సార‌థుల‌కు వివ‌రించారు. వ‌చ్చే నెల‌లో జ‌రిగే ప‌ట్ట‌భ‌ద్రులు, టీచ‌ర్ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని దిశానిర్దేశం చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గృహ సార‌థుల‌కు చంద్ర‌బాబు చెక్ పెట్టేలా ప్లాన్(TDP Plan) చేశారు.

Also Read : CBN JOBs : జాబ్ కావాలంటే బాబు రావాల్సిందే! టీడీపీ హ‌యాంలోని ఉద్యోగాలివి!