Site icon HashtagU Telugu

Jayaho BC : బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ పార్టీ ఉంది – చంద్రబాబు

Cbn Bc

Cbn Bc

బీసీల డీఎన్‌ఏ (BC DNA)లోనే టీడీపీ పార్టీ (TDP) ఉందని , బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని మంగళగిరి లో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ(Jayaho BC)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ – జనసేన కూటమి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. రీసెంట్ గా తాడేపల్లి గూడెం లో ఏర్పాటు చేసిన సభ సక్సెస్ కావడం తో ఈరోజు మంగళగిరి వేదికగా జయహో బీసీ పేరుతో సభ ఏర్పటు చేసి బీసీ డిక్లరేషన్‌ (BC Declaration) ను ప్రకటించారు. ఈ సభకు ఇరు పార్టీల అధినేతలు , పార్టీ నేతలు హాజరై సభ ను సక్సెస్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సభ వేదిక ఫై చంద్రబాబు మాట్లాడుతూ..బీసీలకు టీడీపీ 40 ఏళ్లుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ పార్టీ ఉందని , బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, రాబోయే రోజుల్లో పింఛను రూ.4 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీల రుణం తీర్చుకునేందుకే పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చినట్లు తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షా 50 వేల కోట్లు కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.

జగన్ వచ్చాక స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించారని బాబు ఆరోపించారు. రిజర్వేషన్ తగ్గించడం వల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోయారని , చట్టబద్ధంగా బీసీల కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తాం. బీసీల జోలికి ఎవరైనా వస్తే జాగ్రత్త. పరిశ్రమలు పెట్టేలా బీసీ వర్గాలను ప్రోత్సహిస్తాం. బీసీలకు షరతులు లేకుండా విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. చంద్రన్న బీమా కింద బీసీలకు రూ.10 లక్షలు ఇస్తాం. లంచాలు లేకుండా బీసీలకు ధ్రువపత్రాలు ఇచ్చేలా చూస్తాం అన్నారు. ఇక బీసీ డిక్లరేషన్‌ గురించి ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు. వందల సమావేశాలు పెట్టి, నేతల అభిప్రాయాలు తీసుకుని బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు తెలిపారు.

Read Also : AP : జగన్..బీసీల పొట్టకొట్టాడు – జయహో సభలో పవన్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version