Vijay Sai Reddy : సాయిరెడ్డి ఫోన్ ర‌గ‌డ‌, సోష‌ల్ మీడియాలో విచిత్ర పోల్!

వైసీపీ నెంబ‌ర్ 2, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫోన్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ఆయ‌న ఫోన్ ఎలా పోయింద‌ని ప్ర‌శ్నిస్తూ నాలుగు ఆప్ష‌న్ల‌ను టీడీపీ `పోల్‌` పెట్టింది.

  • Written By:
  • Updated On - November 26, 2022 / 02:55 PM IST

వైసీపీ నెంబ‌ర్ 2, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫోన్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. ఆయ‌న ఫోన్ ఎలా పోయింద‌ని ప్ర‌శ్నిస్తూ నాలుగు ఆప్ష‌న్ల‌ను టీడీపీ `పోల్‌` పెట్టింది. వాటిలో (ఏ) కృష్ణా నదిలో విసిరేశారు (బి) రుషికొండ తవ్వకాల్లో పడేశారు (సి) తాడేపల్లి ప్యాలెస్ లాగేసుకుని దాచేసింది (డి) చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ లోనే ఉంది. అంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆసక్తికర పోస్ట్ పెట్టింది . అది మామూలు ఫోన్ కాదు చిత్రగుప్తుడు తయారు చేసిన పాపాల చిట్టా అంటూ టీడీపీ పేర్కొంది. సాయి రెడ్డి ఫోన్ దొరికితే సీబీఐకి ఇవ్వాలి అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుండి అనేక భిన్నమైన సమాధానాలు వచ్చాయి. కొందరు ఫన్నీగా ఆప్షన్ పెట్టి సమాధానమిచ్చారు.

ప్ర‌తిగా చంద్రబాబును టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేసిన విజయసాయిరెడ్డి రివర్స్ కౌంటర్ వేసి చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు చిప్పు దొబ్బింది అని, చంద్రబాబుకు మైండ్ పనిచేయడం లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి తనదైన శైలిలో ఎదురు దాడి చేశారు. `చంద్రం చిప్ ఎలా దొబ్బింది? (ఏ) మాధవ రెడ్డి ఫాంహౌజ్ లో ఉంది. (బీ) బోకేష్ దొబ్బేశాడు. (సీ) టీడీపీ చిల్లర దొంగలు కాజేశారు (డీ) అమరావతి రియల్ ఎస్టేట్ భూముల్లో పాతేశాడు. అంటూ తనదైన శైలిలో ఆప్ష‌న్ల ఇచ్చి సోష‌ల్ మీడియాలో రివర్స్ ఎటాక్ ఇచ్చారు.

సోష‌ల్ మీడియాలో రెండు రోజులుగా ఈ రెండు అంశాల‌పై టీడీపీ, వైసీపీ ప్రేమికులు యుద్ధం చేసుకుంటున్నారు. రాజ‌కీయాల‌తో సంబంధంలేని కొంద‌రు నెట్ జ‌న్లు ఫ‌న్నీ కామెంట్స్ పెడుతూ హైలెట్ గా నిలుస్తున్నారు. సాయిరెడ్డి ఫోన్ పోవటం రాజ‌కీయ రగడగా మారింది. ఫోన్ ఎక్కడా పోలేదని ఇదంతా సాయి రెడ్డి ఆడుతున్న డ్రామా అని తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రా రెడ్డి ని అరెస్ట్ చేసిన త‌రువాత‌ తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతో సెల్ ఫోన్ ను దాచిపెట్టారని టీడీపీ భావిస్తోంది. చికోటి ప్రవీణ్ ఫామ్ హౌస్ వ్యవహారంలోనూ ఆందోళనలో ఉన్న ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపణలకు దిగారు.

విజయసాయి పర్సనల్ ఫోన్ పోయిందంటూ ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. విజయసాయి లేటెస్ట్ మోడల్ ఐఫోన్ వాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ వ్యవహారంపై స్పందించారు. దేశంలోకెల్లా అవినీతిలో ప్రధాన రాజకీయనాయకుడు విజయసాయిరెడ్డి అని పేర్కొన్నారు. ఆయన ఫోన్ దొరికితే అధికారంలో ఉన్న రెండు పెద్ద తలలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. అయితే, విజయసాయిరెడ్డి తలుచుకుంటే తప్ప ఆ ఫోన్ ను ఏ పోలీసు అధికారి కూడా పట్టుకోలేడని వర్ల రామయ్య చ‌మ‌త్క‌రించ‌డంఈ ఎపిసోడ్ లో కొస‌మెరుపు.