TDP Old : తెలుగుదేశం వైపు 70ప్ల‌స్ ! క‌న్నా చేరిక‌తో 1983 బ్యాచ్ యాక్టివ్ !

తెలుగుదేశం పార్టీలో (TDP Old) చేరిన ల‌క్ష్మీనారాయ‌ణ వ‌య‌స్సు 70 ప్ల‌స్. గ‌త ప‌దేళ్లుగా

  • Written By:
  • Publish Date - February 24, 2023 / 01:12 PM IST

తెలుగుదేశం పార్టీలో (TDP Old) చేరిన మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌య‌స్సు 70 ప్ల‌స్. గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న(Kanna) ప్ర‌త్య‌క్ష రాజ‌కీయ ప్ర‌స్థానం ఆగిపోయింది. అలాంటి లీడ‌ర్ ను టీడీపీ తీసుకుంది. పైగా ఆయ‌న‌కు రెండు నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌, మంత్రి ప‌ద‌విని హామీ ఇచ్చార‌ని తెలుగుదేశంలోని ఒక వ‌ర్గం చ‌ర్చించుకుంటుంది. రాబోవు రోజుల్లో మ‌రికొంద‌రు 70 ప్ల‌స్ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైపు వ‌స్తార‌ని, వాళ్ల‌కు కూడా మంత్రి ప‌ద‌వుల హామీ ఇస్తార‌ని తెలుస్తోంది. అదే విష‌యాన్ని టీడీపీలోని యువ లీడ‌ర్లు చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌య‌స్సు 70 ప్ల‌స్ (TDP Old) 

టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడును రాజ‌కీయంగా ఛీత్క‌రించుకున్న ప్ర‌త్య‌ర్థుల జాబితాలో మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ(TDP Old) ప్ర‌ధ‌మంగా ఉంటారు. వ్య‌క్తిత్త‌త్వ హ‌న‌నం చేసిన లీడ‌ర్ కూడా ఆయ‌న‌. అంతేకాదు, చంద్ర‌బాబు ప్రైవేటు జీవితాన్ని కూడా విడ‌వ‌కుండా ఒకానొక సంద‌ర్భంలో దారుణ ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన లీడ‌ర్ క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. గ‌త 40ఏళ్లుగా అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట ఒంటికాలు మీద చంద్ర‌బాబును దుర్భాష‌లాడిన సీనియ‌ర్ కాంగ్రెస్ లీడ‌ర్ క‌మ్ బీజేపీ ఏపీ మాజీ అధ్య‌క్షుడు క‌న్నా(Kanna). అలాంటి లీడ‌ర్ ను అక్కున చేర్చుకుని ఇప్పుడు టీడీపీ క్యాడ‌ర్ మీద రుద్దారు. ఇదే విష‌యాన్ని గుంటూరు టీడీపీ లీడ‌ర్లు ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబు ఇక మార‌డంటూ కొంద‌రు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న చెందుతూ పార్టీ కోసం రాజీప‌డ‌క త‌ప్ప‌ద‌ని స‌ర్దుకుంటున్నారు.

Also Read : TDP Plan : గృహ‌సార‌థుల‌కు పోటీగా సాధికార సార‌థులు! చంద్ర‌బాబు ప్ర‌ణాళిక.!

తొలి నుంచి గుంటూరు జిల్లా రాజ‌కీయం ఎక్కువ‌గా క‌న్నా(Kanna) వ‌ర్సెస్ రాయ‌పాటి మ‌ధ్య న‌డిచింది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేసిన వాళ్లిద్ద‌రూ అంత‌ర్గ‌తంగా కుమ్మ‌లాడుకునే వాళ్లు. కొన్ని ద‌శాబ్దాల పాటు సైకిల్ కాంగ్రెస్ అంటూ రాయ‌పాటి మీద క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ బ‌ల‌మైన అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఆ త‌రువాత 2014 నాటికి టీడీపీ గూటికి రాయ‌పాటి చేరుకున్నారు. ఫ‌లితంగా ప్ర‌త్య‌క్ష యుద్ధం క‌న్నా, రాయ‌పాటి మ‌ధ్య న‌డిచింది. బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు అయిన త‌రువాత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ నోరు కొంత త‌గ్గింది. గ‌తంలో క‌మ్మ సామాజిక‌వ‌ర్గం మీద నోరు పారేసుకున్న సంద‌ర్భాల్లో అనేకం. ఆ విష‌యం గుంటూరు జిల్లా క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి బాగా తెలుసు.

రాయ‌పాటి వ‌ర్గం క‌న్నా మీద‌ శంఖం 

ప్ర‌స్తుతం టీడీపీలో బ‌ల‌మైన లీడ‌ర్ గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కిమ్మ‌న‌కుండా ఉన్నారు. ఆయ‌న‌తో ఎలాంటి సంప్ర‌దింపులు లేకుండా క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌కు పార్టీలో స్థానం క‌ల్పించార‌ని క్యాడ‌ర్ చెప్పుకుంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా గెలుస్తాడో చూద్దామంటూ ఇప్ప‌టి నుంచే రాయ‌పాటి వ‌ర్గం క‌న్నా(Kanna) మీద‌ శంఖంపూర్తిస్తుంద‌ట‌. దీంతో క‌న్నా రూపంలో టీడీపీ గుంటూరు విభాగంలో పెద్ద ఎత్తున అంత‌ర్గ‌త క‌ల‌క‌లం బ‌య‌లు దేరింది. పైగా క‌న్నా గ‌త కొన్నేళ్లుగా చురుకైన రాజ‌కీయ తెర మీద క‌నుమ‌రుగైన లీడ‌ర్ గా భావిస్తున్నారు. అందుకే, ఆయ‌న ర్యాలీలో వ‌చ్చిన వాళ్ల‌లో 80శాతం టీడీపీ వాళ్లు మిన‌హా ఆయ‌న వ్య‌క్తిగ‌త క్యాడ‌ర్ లేద‌ని తేల్చేస్తున్నారు.

 70 ప్ల‌స్ కోటాలో  మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి (TDP Old)

కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాదిరిగా నెల్లూరు జిల్లాలోనూ 70 ప్ల‌స్ కోటాలో(TDP Old) మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి త్వ‌ర‌లో టీడీపీ గూటికి రాబోతున్నారు. ఇలా ప్ర‌తి జిల్లాలోనూ ఇత‌ర పార్టీలు వ‌దిలేసిన 70 ప్ల‌స్ బ్యాచ్ టీడీపీ వైపు చూస్తున్నారు. వాళ్ల‌ను కూడా చంద్ర‌బాబు ఆహ్వానించే అవ‌కాశం ఉంది. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 ప్లస్ వృద్ధుల‌కు లేదా వాళ్ల పిల్ల‌ల‌కు టిక్కెట్ల ఇచ్చేలా హామీలు ఇస్తున్నార‌ని టాక్‌. ఈ ప‌రిణామం టీడీపీలోని ఔత్సాహిక యూత్ కు కంట‌గింపుగా ఉంది. కొత్త త‌రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో వాళ్లు క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. ఎవ‌ర్నీ కాద‌న‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న చంద్ర‌బాబు 70 ప్ల‌స్ లీడ‌ర్ల‌ను పార్టీలోకి తీసుకోవ‌డం మాత్రం కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడుతోంది. కాడికింద‌పేడేసిన లీడ‌ర్ల‌తో టీడీపీ నిండిపోతుంద‌ని వైసీపీ సెటైర్లు వేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CBN : ఇప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ఉంటే.!`గ‌న్న‌వ‌రం` ఎపిసోడ్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!