Site icon HashtagU Telugu

TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్ర‌జాభిప్రాయం మేర‌కే టికెట్లు ఇస్తామ‌న్న‌ చంద్రబాబు

TDP

TDP

2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధ‌మ‌ని టీడీప అధినేత చంద్రబాబు అన్నారు. వీటిపైనే రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని.. వచ్చే ఎన్నికల్లో పార్టీలు వ్యక్తులు కాదని.. రాష్ట్రం గెలవాల‌న్నారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అభ్యర్థుల మార్పు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ 150 మంది అభ్యర్ధులను మార్చినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలవదన్నారు. జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని.. రాష్ట్రంలో ఇంత విఫలం అయిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు అని చంద్రబాబు అన్నారు. మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రాన్ని రైతాంగాన్ని కనీవినీ ఎరుగని విధంగా నష్ట పరిచిందని.. 15 జిల్లాల్లో దాదాపు 22 లక్షలఎకరాల్లో పంటనష్టం జరిగిందని చంద్రబాబు తెలిపారు. తుఫాన్ వస్తుందని తెలిసీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ముందే స్పందించి తగిన శ్రద్ధ తీసుకొని ఉంటే చాలావరకు నష్టాన్ని నివారించే అవకాశముండేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రైతుల్ని పరామర్శించడానికి తెనాలి.. బాపట్ల వెళ్తే అక్కడ చిన్నిచిన్న పిల్లలు రాత్రిళ్లు కూడా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేశారని చంద్ర‌బాబు గుర్తు చేశారు. చెన్నై వెళ్తే అక్కడ చదివే తెలుగు విద్యార్థులు త‌న‌తో మాట్లా డటానికి రోడ్డుపైకి వచ్చారని.. ఇంత వ్యతిరేకత ఎక్కడా ఎన్నడూ చూడలేద‌న్నారు. మొన్నటివరకు 175కు 175 స్థానాలు గెలుస్తానన్న జ‌గ‌న్‌.. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 11 మందిని మార్చార‌ని తెలిపారు. టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో ప్ర‌జ‌ల‌ అభిప్రాయాలు తీసుకుంటానని.. సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేస్తానని చంద్ర‌బాబు తెలిపారు. ఆఖరికి కుప్పంలో కూడా ప్రజాభిప్రాయసేకరణ చేస్తానని తెలిపారు. వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక అంతా తాడేపల్లిలో జరుగుతుందని.. టీడీపీ ఎంపిక అంతా ప్రజామోదంతో జరుగుతుందన్నారే. నూతన విధానంతో త‌న‌కు తప్ప, ఎవరికీ తెలియకుండా అభ్యర్థుల చరిత్రను తెలుసుకొని ఎంపిక చేస్తానని తెలిపారు. తాను ఏ పద్ధతి అనుసరించి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాననేది ముందే చెప్ప‌న‌ని.. సరైన సమయంలో సరైన వారినే ఎంపిక చేస్తాన‌న్నారు.

Also Read:  Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?