Site icon HashtagU Telugu

Nara Lokesh Phone Tapping: ఏపీలో ట్యాపింగ్ ప్ర‌కంప‌నలు.. నారా లోకేశ్‌ ఫోన్ ట్యాపింగ్..!

Nara Lokesh Phone Tapping

Nara Lokesh

Nara Lokesh Phone Tapping: ఫోన్ ట్యాపింగ్.. ఈ ప‌దం వింటే మొద‌ట గుర్తుకు వ‌చ్చేది తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో గ‌త ప్ర‌భుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్ప‌డింద‌ని ప‌లువురు అధికారులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు నోటీసులు అందాయి. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఉన్న‌తాధికారుల‌ను అదుపులోకి విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కూడా పాకింది. అధికార పార్టీ అయిన వైసీపీ త‌మ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శ నారా లోకేష్ ఫోన్‌ను ట్యాపింగ్ చేయ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వార్త‌ల‌కు బ‌లం వ‌చ్చేలా యాపిల్ సంస్థ నారా లోకేష్‌ను ట్యాపింగ్ విష‌యంలో అల‌ర్ట్ చేసింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh Phone Tapping)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. లోకేశ్ వాడుతున్న ఐ ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. మరోవైపు లోకేశ్ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసింది వైసీపీ ప్రభుత్వమే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వారు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే నారా లోకేష్ డేటా, కాంటాక్ట్స్, అత‌ను ఎవ‌రితో మాట్లాడుతున్నాడు..? ఎవ‌రితో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు అనే విష‌యాలు బ‌హిర్గ‌త‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

Also Read: Pushpa 2 Audio Rights : పుష్ప 2 ఆడియో రైట్స్ రికార్డు.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

గ‌తంలో లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంధ్ర కుమార్ లేఖ రాశారు. గుర్తుతెలియని ఏజెన్సీల ద్వారా పెగాసస్ సాప్ట్‌వేర్‌ సాయంతో లోకేష్ ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయన్నారు. ఇలాంటి సందేశాలే లోకేష్‌కు 2024 మార్చిలో కూడా వచ్చాయన్నారు.

We’re now on WhatsApp : Click to Join