Site icon HashtagU Telugu

Nara Lokesh : కేంద్ర హోంమ‌త్రి అమిత్‌షాతో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ

TDP

TDP

ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ క‌లిశారు. సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి కక్షసాధింపు చర్యలను నారా లోకేష్ అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్నార‌ని లోకేష్ అమిత్‌షాకు వివ‌రించారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అమిత్‌షాకు తెలిపారు. చంద్రబాబు పై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారని లోకేష్ ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగారు. కక్ష సాధింపు తో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి లోకేష్ వివ‌రించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్‌షా అభిప్రాయ‌ప‌డ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్ తో అమిత్ షా అన్నారు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నిన్న సీఐడీ విచార‌ణ ముగిసిన అనంత‌రం లోకేష్ నేరుగా ఢిల్లీ వెళ్లారు. శుక్ర‌వారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిష‌న్ విచార‌ణ ఉన్న నేప‌థ్యంలో లోకేష్ ఢిల్లీ వెళ్లి న్యాయ‌వాదుల‌తో చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మ‌యంలో బుధ‌వారం రాత్రి లోకేష్ కేంద్ర‌హోమంత్రి అమిత్‌షాని క‌లిసిన రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.

Also Read:  Makineedi Seshu Kumari : జనసేన పార్టీ కి భారీ షాక్..కీలక నేత రాజీనామా