Yuvagalam : నేడు నారా లోకేష్ “యువ‌గ‌ళం” పాద‌యాత్ర ప్రారంభం.. కుప్పంకు భారీగా త‌ర‌లివ‌చ్చిన టీడీపీ శ్రేణులు

  • Written By:
  • Updated On - January 27, 2023 / 07:15 AM IST

తెలుగుదేశం పార్టీని వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా నారా లోకేష్ పాద‌యాత్ర చేపడుతున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈ రోజు (శుక్ర‌వారం) 11 గంట‌ల 03 నిమిషాల‌కు పాద‌యాత్ర తొలి అడుగుప‌డ‌నుంది. ఇప్ప‌టికే పాద‌యాత్ర‌కు సంబంధించి జిల్లా నేత‌లు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న నారా లోకేష్ .. కుప్పం చేరుకున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా ఈ పాద‌యాత్ర కొన‌సాగ‌నుంది. చారిత్రాత్మక పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో కుప్పం చేరుకున్నారు. గ్రామస్థాయి నేత నుంచి పొలిట్ బ్యూరో సభ్యులవరకు నేతలు కుప్పం చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది. కుప్పం పట్టణంలో వీధులన్నింటినీ పార్టీ శ్రేణులు టీడీపీ జెండాలు, బెలూన్లు, బ్యానర్లు, స్వాగత తోరణాలతో అలంకరించడంతో పసుపువర్ణంగా మారింది. ఈ రోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు నారా లోకేష్ కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి వరద రాజస్వామి గుడికి చేరుకుని అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని 11.03 గంట‌ల‌కు పాదయాత్రకు శ్రీకారం చుట్ట‌నున్నారు. యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టే వరదరాజస్వామి గుడి పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. మరోవైపు కుప్పం హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో సుమారు పదెకరాల ప్రాంగణంలో బహిరంగసభ కోసం పార్టీ సీనియర్ నేతల పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిరోజు యువనేత పాదయాత్రను భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

నారా లోకేష్ కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర షెడ్యూల్‌

11.03 AM – పూజ అనంతరం గుడి ఆవరణలో పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకుని పాదయాత్రకు శ్రీకారం.
11.30 AM – సమీపంలోని మసీదులో ప్రార్థనలు.
11.55 AM – హెబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో ప్రార్థనలు.
12.45 PM – డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు.
1.05 PM – కుప్పం బస్ స్టేషన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు.
1.25 PM – కొత్త బస్ స్టేషన్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు.
3.00 PM – హెచ్ పి పెట్రోలు బంకు సమీపంలో బహిరంగసభ.
4.30 PM – ట్రాఫిక్ ఐలాండ్ జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు. కుప్పం ప్రభుత్వాసుపత్రి క్రాస్, శెట్టిపల్లి క్రాస్, బెగ్గిలపల్లి క్రాస్, పిఇఎస్ మెడికల్ కాలేజి సమీపాన క్యాంప్ సెట్ కు చేరిక.
6.45 PM – పిఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ కు చేరిక, విరామం.
(1వరోజు 8.5కిలోమీటర్లు)

28-1-23 (శనివారం) – 2వరోజు

8.00 AM – కుప్పం పిఇఎస్ మెడికల్ కళాశాల సమీపాన క్యాంప్ సైట్ నుంచి 2వరోజు పాదయాత్ర ప్రారంభం.
9.15 AM – బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటామంతీ.
11.05 AM – కడపల్లిలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం.
1.30 PM – కలమలదొడ్డిలో భోజన విరామం – పార్టీ సీనియర్ నేతలతో సమావేశం
3.30 PM – కలమలదొడ్డినుంచి పాదయాత్ర కొనసాగింపు
5.00 PM – శాంతిపురం క్యాంప్ సైట్ కు చేరిక – ప్రముఖులతో సమావేశం
6.45 PM – 2వరోజు పాదయాత్రకు విరామం – శాంతిపురంలో బస.
(2వరోజు 9.3కిలోమీటర్లు)

29-1-2023 – (ఆదివారం) –
3వరోజు

8.00 AM – శాంతిపురం క్యాంప్ సైట్ నుంచి 3వరోజు యాత్ర ప్రారంభం
8.45 AM – ప్రముఖులతో సమావేశం
9.45 AM – బడుమాకళ్లపల్లెలో పార్టీ పెద్దలతో ఆశీర్వచనం
12.15 PM – కె.గెట్టపల్లి జంక్షన్ లో స్థానికులతో మాటమంతీ.
12.45 PM – కె.గెట్టపల్లిలో భోజన విరామం.
3.00 PM – కె.గెట్టపల్లి జంక్షన్ నుంచి పాదయాత్ర కొనసాగింపు.
5.00 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ కు చేరిక. ప్రముఖులతో సమావేశం.
5.55 PM – చెల్దిగానిపల్లి క్యాంప్ సైట్ లో 3వరోజు పాదయాత్రకు విరామం, బస.
(3వరోజు 11కిలోమీటర్లు).