Nara Bhuvaneswari : “స‌త్య‌మేవ‌ జ‌య‌తే”.. రాజ‌మండ్రిలో దీక్ష చేప‌ట్టిన నారా భువ‌నేశ్వ‌రి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌కు నిర‌స‌న నారా భువ‌నేశ్వ‌రి నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. దీక్ష‌కు సత్యమేవ

  • Written By:
  • Updated On - October 2, 2023 / 12:45 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌కు నిర‌స‌న నారా భువ‌నేశ్వ‌రి నిరాహార‌దీక్ష చేప‌ట్టారు. దీక్ష‌కు సత్యమేవ జయతే అనే పేరు పెట్టారు. దీక్షకు ముందు రాజమహేంద్రవరంలో గాంధీ విగ్రహానికి నారా భువ‌నేశ్వ‌రి పూలమాల వేసి నివాళులర్పించారు. భువ‌నేశ్వ‌రి వెంట భారీగా తెలుగు మ‌హిళ‌లు త‌ర‌లివ‌చ్చారు. గాంధీ జ‌యంతి రోజున ఒక్క రోజు ఆమె దీక్ష‌ను చేప‌ట్టారు. సాయంత్ర 5గంట‌ల వ‌ర‌కు ఈ దీక్ష కొన‌సాగనుంది. ఇటు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా దీక్ష చేప‌ట్టారు. ప్ర‌భుత్వం అక్ర‌మ అరెస్ట్‌ల‌కు నిర‌స‌గా ఆయ‌న దీక్ష చేప‌ట్టారు. ఆయ‌న దీక్ష‌కు మ‌ద్ద‌తుగా భువ‌నేశ్వ‌రి, లోకేష్‌, బ్రాహ్మ‌ణి, నంద‌మూరి బాల‌కృష్ణ స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేత‌లు కార్య‌క‌ర్త‌లు దీక్ష చేప‌ట్టారు. గ‌త 23 రోజులుగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రిమాండ్ లో ఉన్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో ఆయ‌న్ను రిమాండ్ పంపిచారు. అయితే ఇది త‌ప్పుడు కేసు అని..హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేసిన‌ప్ప‌టికి అక్క‌డ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా తీర్పు వ‌చ్చింది. దీంతో సుప్రీంకోర్టులో చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్ విచ‌ర‌ణ జ‌రుగుతుంది.