Site icon HashtagU Telugu

Konaseema Violence : `కోన‌సీమ‌`పై టీడీపీ ఆచితూచి అడుగు

Pawan Kalyan Chandrababu Naidu

Pawan Kalyan Chandrababu Naidu

కోన‌సీమ జిల్లా పేరు మార్చడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. కోనసీమ పేరును పూర్తిగా తీసివెయ్యగుండా కోనసీమ జిల్లా ముందు అంబేద్కర్ పేరు చేర్చారు . కులాల మధ్య‌ కుంపట్లు రగిలించి వచ్చే ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని కొన్ని రాజ‌కీయ పార్టీలు చూస్తున్నాయి. SC ఓటు బ్యాంకు కోసం అంబేద్కర్ పేరు పెట్టి అక్కడి SCలు, ఇతర కులాల మ‌ధ్య‌ వైరుద్యాలను పెంచి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అంబేద్కర్ ఒక్క SC లకు మాత్రమే నాయకుడు కాదు. భారతజాతి గర్వించదగ్గ ప్రపంచ మేధావి.

శూద్రులతో సహా ప్రతి వ్యక్తి తల ఎత్తుకునే విధంగా నిలబెట్టిన అంబేద్క‌ర్ ను ఒక వ‌ర్గానికి కొంద‌రు ప‌రిమితం చేస్తున్నారు. అలాంటి అంబేద్కర్ ని ఓటు బ్యాంక్ రాజకీయాలలోకి లాగి ఓట్ల శాతాన్ని సుస్థిరం చేసుకోవాలని చూడ‌డం రాజ‌కీయ పార్టీల భావ‌దారిద్ర్యం. ఇలాంటి రాజ‌కీయాల కార‌ణంగా ఇతర రాష్ట్రాల ముందు ఏపీ చులకనగా నిలుస్తోంది. విజయవాడ లో Pwd గ్రౌండ్స్ స్థలాన్ని అంబేద్కర్ స్మృతి వనంగా మార్చి అక్కడ గొడవ పెట్ట‌డానికి తొలి జ‌రిగింది. కడప, కర్నూల్ లో జిల్లాల్లో పెట్ట‌ని స్మ్రుతి వనాలను విజ‌య‌వాడ‌లో ఎందుకు పెట్టాలి అనుకుంటున్నారు? ఇక్కడే ఎందుకు పెట్టాలి ? ఎందుకంటే కులాల పేర రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేయాలని , తద్వారా ఓటు బ్యాంకును పదిల పర్చుకోవాలని కొంద‌రి కుట్ర‌గా భావించ‌డం స‌ర్వ‌సాధార‌ణం.

మాజీ ఎ.పి Cm చంద్రబాబు భారీస్థాయిలో అమరావతి లో అంబేద్కర్ స్మృతివనం కు స్థలం కేటాయించారు ప్రభుత్వం మారిన‌ తరువాత దాన్ని అటకెక్కించి విజయవాడ నడి బొడ్డున ఎందరికో ఉపయోగ కరమైన, అనేక ప్రదర్శనలకు వీలైన స్థలాన్ని అంబేద్కర్ విగ్రహానికి కేటాయించడం లో ఆంతర్యం ఏమై ఉంటుందో ఆంధ్రా ప్రజలు ఆలోచించాలి. SC లతో పాటు మరో మేజర్ కులం చేజారి పోకుండా అధికాప‌క్షం వేస్తోన్న ఎత్తుగ‌డ‌గా విప‌క్షాలు అంచ‌నా వేస్తున్నాయి. రెండు కులాల మధ్య‌ చిచ్చు పెట్టే విధంగా పథ‌క రచన చేసినట్లు ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవలు అధికార పార్టీ వారే కావాలని సృష్ఠించార‌ని బహిరంగంగా విప‌క్షాలు ఆరోప‌ణ‌ల‌కు దిగాయి. కోనసీమ జిల్లా పేర విద్వంసాన్ని సృష్టించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చెయ్యా లనే కుట్రకోణం ఇందులో దాగున్నదని అనుమానిస్తున్నారు. నిరశన తెలిపే కార్యక్రమం హటాత్తుగా ఆందోళనగా మారి ఒక్కసారే మంత్రుల‌ ఇళ్లపై దాడి చెయ్యడం వెనక గూడుపుఠాణీ ఉండొచ్చ‌ని అనుమానం రావ‌డం స‌హ‌జం.

గతంలో కూడా ఇలాంటి దహన సంఘటనలు ఆ ప్రాంతాలలో జరిగాయి. కావున ఇందులో కుట్ర కోణం దాగి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. Cm దేశంలో లేని సమయంలో చేసారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం దాగి ఉందనే సందేహం విప‌క్షాల‌ను వెంటాడుతోంది. PK టీం ప్లాన్ B ని అమలు చేస్తున్నట్లుగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నారు. ముందుగా అంబేద్కర్ జిల్లాగా మార్చమని అనేకులు వినతులు, నిరశనలు తెలిపారు. అప్పుడు కాదని కోనసీమ జిల్లాగానే మారుస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు పూర్తిచేసిన తరువాత హఠాత్తుగా అంబేద్కర్ పేరును చేర్చుతున్నట్లు ప్రకటించడంతో ఉవ్వెత్తున నిరశన గళం వినిపిస్తోంది.

ఇందులో అధికార పార్టీ వారి కుట్ర కోణం దాగి ఉండొచ్చని విప‌క్షాల అభిప్రాయంగా ఉంది. మంత్రి , Mla ఇళ్లు తగలబడుతుంటే ఫైరింజన్ వారు ఏమి చేస్తున్నట్లు ? ఇది హఠాత్తుగా జరిగిన నిరశన కాదని వ్యూహాత్మకంగా పన్నిన వల అనుమానిస్తున్నారు. వీరి వెనక అధికార పార్టీ వారు ఉండి కులాల మధ్య‌ చిచ్చు రగిలించాలనే ఎత్తుగడ దాగి ఉండవచ్చు అనేది టీడీపీ, జ‌న‌సేన చేస్తోన్న ఆరోప‌ణ‌. మంత్రి అనుయాయులే ఆందోళనలో పాత్ర వహించినట్లు పోలీసు విచార‌ణ‌లోనూ తేలింది. దీని పర్యవసానం SC లు ఒక ప్రక్క, మిగతా కులాలు మరోప్రక్క చీలిపోవాలనే కుట్రకోణం ఉంద‌ని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు అంచ‌నా వేస్తున్నారు. ఆ క్ర‌మంలో అత్యుత్సాహంతో టీడీపీ పోస్టింగులు పెట్టకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ తగిన విధంగా పోస్టింగులపై స్పందిస్తున్నారు. జాగరూకతతో , సమ్యమనంతో ఏ కులాన్నీ ధూషించకుండా పోస్టింగులు ఉండే విధంగా చూసుకో వాల‌ని టీడీపీ అధిస్టానం సూచించిన‌ట్టు తెలుస్తోంది. అత్యుత్సాహంతో పుండు మీద కారం చల్లినట్లు పోస్టింగులు పెట్టి ఆ తరువాత అభాసుపాలు కావొద్దని సూచించిన‌ట్టు స‌మాచారం.

కోన‌సీమ జిల్లాలో ఎక్కువ‌గా ద‌ళిత ఓటు బ్యాంకు ఉంటుంది. ఆ త‌రువాత కాపు సామాజిక‌వ‌ర్గం బ‌లంగా ఉంటుంది. ఆక్క‌డ కాపు, శెట్టి బ‌లిజ‌ల‌కు రాజ‌కీయంగా వైరం ఉంది. బలిజ‌, కాపు కులాల మ‌ధ్య కూడా గ్యాప్ ఉంది. కాపులు ఒక వ‌ర్గంగానూ, ద‌ళితుల‌తో క‌లిసి శెట్టి బ‌లిజ‌లు మ‌రో వ‌ర్గంగానూ ఉంటుందని క్షేత్ర‌స్థాయి ఓటు బ్యాంకు ఆధారంగా అంచ‌నా వేయొచ్చు. ప్ర‌స్తుతం కాపు సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా జ‌న‌సేన పార్టీకి అండగా ఉంది. శెట్టి బ‌లిజ‌లు మాత్రం కొన్ని చోట్ల జ‌న‌సేన‌కు దూరంగా ఉంటుంది. ఇక ద‌ళితులు ఎక్కువ‌గా వైసీపీకి అండ‌గా ఉంటుంది. ఆ క్ర‌మంలో కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరును జోడించ‌డానికి అధికార‌ప‌క్షం సిద్ధ‌ప‌డింద‌ని ప్ర‌త్యర్థి పార్టీల అంచ‌నా. సామాజిక ఈక్వేష‌న్ల క్ర‌మంలో జ‌రిగిన కోన‌సీమ విధ్వంసం వెనుక జ‌న‌సేన ఉంద‌ని వైసీపీ చెబుతోంది. అధికార‌ప‌క్షం కులాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికి అంబేద్క‌ర్ పేరును కోన‌సీమ‌కు జోడించింద‌ని ఆరోపిస్తోంది. ఆ రెండు పార్టీల ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టింగ్‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఆ క్ర‌మంలో పోస్టింగ్ ల ప‌ట్ల‌ టీడీపీ వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తోంది.

ఎవరైనా అడ్డదిడ్డంగా పోస్టింగులు పెడితే వెంఠనే ఖండించండి. ఏ మాత్రం ఈ ఆందోళ నలతో టీడీపీకి సంబంధం లేక పోయినా ఆ పార్టీ పేరున కావాలనే పోస్టింగులు పెట్టిస్తార‌ని అలాంటి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆదేశించిన‌ట్టు వినికిడి. ముఖ్యంగా టీడీపీ యూత్ సరిగా అవగాహన చేసుకోక పోస్టింగ్ లు ఫార్వర్డ్ చేసే అవ‌కాశం ఉంద‌ని అప్ర‌మ‌త్తం చేసింది. ప్ర‌త్య‌ర్థి పార్టీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీని ఉద్దేశ పూర్వ‌కంగా డామేజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. అలాంటి అవకాశాలకు తావు ఇవ్వొద్దని టీడీపీ క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది.

కొత్తగా ఏర్ప‌డిన జిల్లాల తగవులు ఇంతటితో ఆగిపోవు. రాబోవు రోజుల్లో Ntr జిల్లాపై కూడా ఇలాంటి కుట్రలు బైలుదేరినా ఆశ్చర్య పడ నవసరం లేదు. పరిస్థితులకు అణుగుణంగా మసలు కోవా లని , రాబోయే కాలంలో ఇంకా బహుముఖంగా PK టీం మాయోపాయాలు విడుదల చేసే అవకాశం ఉంద‌ని టీడీపీ అప్ర‌మ‌త్తం అయింది. ఎక్కడి కక్కడ PK టీం ఆగడా లను ఎండగట్ట‌డానికి విజ్ఞతతో ఆలోచనలు చేయాలని టీడీపీ యూత్ కు అవ‌గాహ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తోంది. నిజం నిలకడ మీద తెలిసేంత వ‌ర‌కు టీడీపీ ఆచితూచి అడుగు వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.