Nara Lokesh In Delhi : ఢిల్లీ రాజ్‌ఘాట్ వ‌ద్ద టీడీపీ ఎంపీల నిర‌స‌న‌.. పాల్గొన్న నారా లోకేష్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ విష‌యం జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 08:28 AM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ విష‌యం జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఆయ‌న జాతీయ స్థాయిలో వివ‌రిస్తున్నారు. జాతీయ మీడియా డిబేట్‌లో ఆయ‌న పాల్గొన్నారు. చంద్ర‌బాబు రిమాండ్ పిటిష‌న్‌తో పాటు ఇత‌ర కేసులు పెడితే ముంద‌స్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాదుల‌తో న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. నిన్న పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న ధ‌ర్నా నిర్వ‌హించారు. చంద్ర‌బాబు అరెస్ట్‌పై టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావించారు, చంద్ర‌బాబుని అక్ర‌మంగా అరెస్ట్ చేశారని..దీనిపై ప్ర‌ధాని మోడీ, కేంద్ర‌హోంమంత్రి అమిత్‌షా స్పందించాల‌ని కోరారు. ఇటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో అవినీతి జ‌రిగిందంటూ చెప్తుండ‌గా.. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు అడ్డుప‌డ్డారు.దీంతో ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ రామ్మోహ‌న్ నాయుడిని “కూర్చోరా బాబు ”  అంటూ మిథున్ రెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. దీంతో టీడీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరుని ఖండించారు.

ఈ రోజు ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వ‌ద్ద టీడీపీ ఎంపీలు నిర‌స‌న చేప‌ట్టారు.రాజ్‌ఘాట్‌ లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ ఎంపీలు నల్ల రీబెన్‌లతో నిరసన తెలిపారు. న్యాయస్థానంలో ఈ రోజు తమకు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం ధర్మంపై నమ్మకం ఉందని… చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీడీపీ నేత‌లు తెలిపారు.