TDP to Amit Shah: మోదీ, అమిత్ షా లకు టీడీపీ ఎంపీ లేఖ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి కష్టాలు తెచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలు ఏపీలో తీవ్రమైన ప్రాణ, ఆస్థి, పంట నష్టానికి దారితీసింది.

Published By: HashtagU Telugu Desk

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి కష్టాలు తెచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలు ఏపీలో తీవ్రమైన ప్రాణ, ఆస్థి, పంట నష్టానికి దారితీసింది.

ఏపీలోని తుఫాను, వర్షాలు,వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లేఖ రాశారు.

ఏపీలో వచ్చిన తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని జయదేవ్ కేంద్రాన్ని కోరారు. తుఫాను కారణంగా రాయలసీమలో ప్రాణ నష్టం, పంట నష్టం జరిగిందని, ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయని తెలిపారు.

రాష్ట్రంలో రవాణా స్తంభించిందని, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న జయదేవ్ తక్షణం ఏపీలో నష్టపోయిన ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఏపీలో పాడైపోయిన రైలు, రోడ్డు సౌకర్యాలను పునరుద్ధరించాలని,
నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని గల్లా జయదేవ్ లేఖలో కోరారు.

  Last Updated: 22 Nov 2021, 11:50 PM IST