టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

TDP MP Putta Mahesh  మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ […]

Published By: HashtagU Telugu Desk
Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

Moinabad Farmhouse Drugs Tdp Eluru Mp Putta Mahesh Kumar Yadav

TDP MP Putta Mahesh  మెయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ కేసులో అరెస్టైన ఆయన.. స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మవద్దని కోరారు. ఏలూరు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా తాను నడుచుకోనని.. ఎప్పుడూ నిజమే చెప్తానంటూ వీడియో విడుదల చేశారు.

మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్.. ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన పుట్టా మహేష్ కుమార్ యాదవ్.. స్టేషన్ బెయిల్ మంజూరు కావటంతో విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా నిమిషం నిడివి గల వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని పుట్టా మహేష్ యాదవ్ కోరారు.

ఏలూరు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం. నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు. మీకు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడున్న వ్యక్తులు ఎన్నో రోజుల నుంచి కలుద్దామని కోరుతున్నారు. నిన్న (శనివారంః నాకు వీలు దొరకటంతో నేను డిన్నర్ కోసం వెళ్లాను. ఆ డిన్నర్‌లో నేను ఎలాంటి తప్పూ చేయలేదు. మీ అందరికీ మరోసారి తెలుపుతున్నా. ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. ఎప్పుడూ తప్పు చేయను. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దు. నేను ఎల్లప్పుడూ నిజమే చెప్తాను. అబద్ధాలు చెప్పను. ధన్యవాదాలు” అంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వీడియో విడుదల చేశారు.

పుట్టా మహేష్ యాదవ్‌కు టీడీపీ షోకాజ్ నోటీసులు

మరోవైపు పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆరోపణలపై వివరణ కోరుతూ పుట్టా మహేష్ యాదవ్‌కు నోటీసులు ఇవ్వాలని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. నేతలు, వ్యక్తుల తప్పులతో పార్టీకి నష్టం జరగనివ్వమని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధినేత ఆదేశాలతో పుట్టా మహేష్‌కు టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫాంహౌస్‌ ఘటనలో మత్తు పదార్థాలు తీసుకున్నట్లుగా మీపై వచ్చిన ఆరోపణలను, మీడియా కథనాలను పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగించేలా ఉన్నాయని.. ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని పుట్టా మహేష్‌ను ఆదేశించింది.

ఈ అంశం గురించి సమగ్ర నివేదిక వచ్చే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ అధిష్టానం ఆదేశించింది. వచ్చిన ఆరోపణలపై ఐదు రోజుల్లోగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని షోకాజ్ నోటీసుల్లో స్పష్టం చేశారు.

 

 

  Last Updated: 16 Mar 2026, 09:58 AM IST