Site icon HashtagU Telugu

MP Lavu krishna devarayalu: జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై అమిత్ షాకు టీడీపీ ఎంపీ లేఖ.. ఏమ‌న్నారంటే..?

Mp Lavu Krishna Devarayalu

Mp Lavu Krishna Devarayalu

MP Lavu krishna devarayalu: వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు టీడీపీ ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు లేఖ రాశారు. వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంగళవారం పర్యటించారు. అందులోభాగంగా ఆయన పోలీసుల‌పై చేసిన వ్యాఖ్యల ప‌ట్ల‌ సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఆ క్రమంలో జగన్ వ్యాఖ్యలపై లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు.

KCR: రేవంత్ రెడ్డే సీఎంగా ఉండాలి..! కేసీఆర్ ఎందుక‌లా అన్నారు.. గులాబీ బాస్‌ వ్యూహం ఏమిటి?

రాష్ట్రంలో శాంతి భద్రతలకు వైఎస్ జగన్ అరాచకాలు ముప్పుగా మారుతోన్నాయని శ్రీకృష్ణదేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అరాచకాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు బుధవారం లేఖ రాశారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు పోలీసుల నైతిక‌త‌ను దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని అన్నారు. బెయిల్ పై ఉన్న జ‌గ‌న్ వ్య‌వ‌స్థ‌ల‌ను బెదిరించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి బెయిల్ ష‌ర‌తుల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని అన్నారు. జ‌గ‌న్ ప్రంస‌గాలు శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లేలా ఉన్నాయి. ప్ర‌జాస్వామ్యానికి హాని క‌గిలించేలా ఉన్నాయి అంటూ లేఖ‌లో పేర్కొన్నారు.

Smita Sabharwal: స్మితా సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ .. ఫొటోలు, వీడియోలు షేర్‌.. ఎందుకంటే?

పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికమని ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు అభివర్ణించారు. రాజ్యాంగ బద్ధంగా పని చేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బ తీసే కుట్రకు తెర తీశారని మండిపడ్డారు. 13 ఏళ్లుగా సీబీఐ, సీఐడీ కేసుల్లో బెయిల్‌పై తిరుగుతున్న వైఎస్ జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవరిహస్తున్నాడని పేర్కొన్నారు. నిజాయితీగా పని చేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులను ఉల్లంఘించటమేనన్నారు. కోడి కత్తి నుంచి రాళ్ల దాడి వరకూ ప్రతిదీ ఒక నాటకమేనని, కోడి కత్తి కేసులో ఎన్ఐఏ ముందు ఒక్కసారి కూడా హాజరు కాని వ్యక్తి.. ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంద‌ని ఎంపీ కృష్ణ‌దేవ‌రాయ‌లు అన్నారు.