Site icon HashtagU Telugu

Kesineni Nani : ఎంపీ నిధులిస్తా.. డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటు చేయండి – టీడీపీ ఎంపీ కేశినేని నాని

Vijayawada TDP

Kesineni Nani

ఎన్టీఆర్ జిల్లాలోని ఏ.కొండూరు కిడ్నీ వ్యాధితో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌డానికి ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అయితే ఏ.కొండూరు పీహెచ్‌సీ ఆవ‌ర‌ణ‌లో డ‌యాల‌సిస్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు త‌న ఎంపీ నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ఎంపీ కేశినేని నాని జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీరావుకు లేఖ రాశారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలంలో అనేక మంది కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నార‌ని.. ఏ.కొండూరు పీహెచ్సీ లో 15 రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామంటూ వైద్య శాఖ మంత్రి విడదల రజిని, అధికారులు హామీ ఇచ్చిన ఇంత వరకు కార్యరూపం దాల్చలేదని ఆయ‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు. ఏ.కొండూరులో డయాలసిస్‌ సౌకర్యం లేకపోవడంతో నూజివీడు, విజయవాడకు వెళ్లి వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదుగా మారి రోగులకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. రూ. 37.00 లక్షల అంచనా వ్యయంతో రెండు ఏసి గదులు, ఆర్ ఓ ప్లాంట్‌తో డయాలసిస్ యూనిట్‌ను స్థాపించడానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బంది ఉన్నదని తాను అర్థం చేసుకున్నాన‌ని.. ప్రజల అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ.కొండూరు పిహెచ్‌సి ఆవరణలో డయాలసిస్ యూనిట్‌ను వెంటనే తన ఎంపీ నిధులు నుండి ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ని కోరారు. డ‌యాల‌సిస్ యూనిట‌, ఆర్వో ప్లాంట్‌కి అవసరమైన వివరాలను తెలియచేయాలని కలెక్టర్ ని ఎంపీ కేశినేని నాని కోరారు.

MP kesineni

Exit mobile version