Site icon HashtagU Telugu

TDP : మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఎంపీ.. నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే..?

Kesineni nani

Kesineni nani

బెజ‌వాడ రాజ‌కీయం మ‌రింత వెడెక్కింది. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్ది టీడీపీలో టికెట్ వార్ న‌డుస్తుంది. బెజ‌వాడ టీడీపీలో ఆధిప‌త్యం కోసం కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తుండ‌టంతో దానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని చెక్ పెడుతున్నారు. ప్ర‌ధానంగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లువురు టీడీపీ నేత‌లు సీట్లు ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న‌, టీడీపీ నాయ‌కుడు నాగుల్‌మీరాల‌తో పాటు ప‌లువురు టికెట్ ఆశిస్తున్నారు. అయితే బుద్ధా వెంక‌న్న‌తో పాటు కొంత‌మంది నేత‌ల‌కు టికెట్లు ఇస్తే స‌హ‌క‌రించ‌బోన‌ని ఎంపీ కేశినేని నాని తెగేసి చెప్తున్నారు. కాల్‌మ‌ని, సెక్స్ రాకెట్, భూక‌బ్జాదారుల‌కు టికెట్లు ఎలా ఇస్తార‌ని ఎంపీ కేశినేని నాని ప్ర‌శ్నిస్తున్నారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌స్తుతం ఎంపీ కేశినేని నాని ఉన్నారు. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాని కానీ ఆయ‌న కుమార్తె ప్ర‌స్తుత కార్పోరేట‌ర్ కేశినేని శ్వేత పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. తాజాగా ఆ ప్ర‌చారాన్నిఆయ‌న కొట్టిపారేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో తాను కానీ త‌న కుటుంబ స‌భ్యులు కానీ ఎవ‌రు పోటీ చేయ్య‌ర‌ని ఆయ‌న తెలిపారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ కానీ మైనార్టీలు కానీ పోటీ చేస్తార‌ని.. నిజాయితీ ప‌రుల‌కే టికెట్ వ‌స్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

నీతి,నిజాయితీ, నిస్వార్ధంగా సేవ చేయటం కోసం మాత్రమే రాజకీయాల్లోకి రావాలని ఎంపీ కేశినేని నాని తెలిపారు. సంపాదన కోసం కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. తాను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే త‌న‌పై అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నార‌ని తెలిపారు. 2019లో M.S బేగ్ తెలుగుదేశం పార్టీలో చేరారని.. తాను M.S బేగ్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చంద్రబాబు వద్దకు తీసుకు వెళ్లానని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం పట్ల, ముస్లిం సామాజిక వర్గం పట్ల, ఎమ్మెస్ బేగ్ తండ్రి స్వర్గీయ M.K బేగ్‌ ఉన్న నిబద్ధత M.S బేగ్‌కి కలిసి వస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీలో మరో 30 ఏళ్లు నిజాయితీ గల, మంచి ముస్లిం నాయకుడు ఉండాలని M.S బేగ్ కి పశ్చిమ నియోజకవర్గం లో త‌న‌ మద్దతు ఇస్తున్నానని కేశినేని నాని తెలిపారు. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదని.. వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నాన‌ని.. పశ్చిమ నియోజకవర్గ ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారని కేశినేని నాని తెలిపారు. విజ‌య‌వాడ పార్ల‌మెంట్‌కు తాను కాపలాదారుడిన‌ని.. తాను ఉన్నంత‌కాలం విజ‌య‌వాడ‌ని కాపాడుకుంటాన‌న్నారు.

Also Read:  YS Sharmila: కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల, చేరికకు రంగం సిద్ధం!