Kesineni Nani : వైసీపీ ఎమ్మెల్యేని మెచ్చుకుంటూ టీడీపీ ఎంపీ నాని కామెంట్స్.. చర్చగా మారిన కేశినేని నాని వ్యాఖ్యలు..

తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని నందిగామ(Nandigama) వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 21, 2023 / 08:00 PM IST

ఏపీ(AP) రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ(TDP) వర్సెస్ వైసీపీ(YCP), వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్నట్టు ఉన్న పరిస్థితి తెలిసిందే. కానీ తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) ఓ వైసీపీ ఎమ్మెల్యేని మెచ్చుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారింది. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని నందిగామ(Nandigama) వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు.

 

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో ఎంపీ నిధులతో రూ.47.00 లక్షల రూపాయలతో నిర్మించిన 90 వేల లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ వాటర్‌ట్యాంక్‌ను నేడు కేశినేని శ్రీనివాస్ (నాని) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీతో వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు.

ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుంది. ప్రజాసేవ కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని నాలుగేళ్లుగా నేను చూస్తున్నాను. అందులో భాగంగానే అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కేటాయించాను. ఇంకా ఏదైనా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు అభివృద్ధి కోసం సహకరిస్తాను. రాజకీయాలు ఎలక్షన్ వరకు పరిమితమైతే బాగుంటుంది. గత నాలుగేళ్లుగా నందిగామ నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య వచ్చినా వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీలు వెంటనే వెంటనే స్పందించి, ప్రజల సమస్యలు పరిష్కరించారని విన్నాను. పార్టీలు వేరైనా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తాం. ప్రజాహితం కోరుకునే పార్టీ నాయకులు ఏ పార్టీ అయినా సరే ప్రజలకు మంచి జరుగుతుందంటే సపోర్ట్ చేస్తారు అని తెలిపారు. దీంతో కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి. మరి నాని చేసిన వ్యాఖ్యలపై ఇరు పార్టీల నాయకుల్లో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read :  Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మారబోతున్నారా?