TDP MLC : గెలుపు`వ‌సంతం`,చంద్ర‌బాబు చాణ‌క్యంలో..!

ఏపీలోని ఎమ్మెల్యేల కోటా కింద జ‌రుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఏ కోణం నుంచి చూసిన‌ప్ప‌టికీ

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 01:59 PM IST

ఏపీలోని ఎమ్మెల్యేల కోటా కింద జ‌రుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఏ కోణం నుంచి చూసిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీకి (TDP MLC) అనుకూలంగా ఉంది. ఎందుకుంటే, టీడీపీ త‌ర‌పున బ‌రిలో ఉన్న పంచుమ‌ర్తి అనురాధ(Panchumarthi Anuradha) వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌. అతి పిన్న వ‌య‌స్సులోనే ఆమె లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కిన రాజ‌కీయ‌వేత్త‌. అంతేకాదు, యువ ఐఏఎస్ ల‌కు త‌ర‌గ‌తులు చెప్ప‌డానికి ప్ర‌త్యేక ఆహ్వానితురాలిగా కూడా ఉన్నారు. ఇలాంటి అర్హ‌త‌లు ఉన్న వెనుక‌బ‌డిన వ‌ర్గానికి చెందిన మ‌హిళ మీద వైసీపీ కుయుక్తులు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ అభాసుపాలు కావ‌డం ఖాయం. ఇప్ప‌టి వ‌ర‌కు వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చామ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పే మాట‌ల‌కు అర్థంలేకుండా పోతుంది. అందుకే, రుజుమార్గంలో ఎన్నిక‌ల‌కు నిర్వ‌హిస్తార‌ని రాజ‌కీయ నిపుణుల అభిప్రాయం.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ తెలుగుదేశం పార్టీకి  అనుకూలం(TDP MLC) 

వాస్త‌వంగా ఏడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఆరు వైసీపీ, ఒక‌టి టీడీపీ(TDP MLC) గెలుచుకునే బ‌లం ఉంది. కానీ, ఏడుకు ఏడు గెలుచుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే ఆయ‌న ఏడుగురిని నిల‌బెట్ట‌గా, టీడీపీ ఒక‌ర్ని బ‌రిలోకి దింపింది. ఫిరాయింపుల‌కు వ్య‌తిరేక‌మ‌ని చెప్పే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌లుగురి టీడీపీ ఎమ్మెల్మేల‌ను త‌న పంచ‌న చేర్చుకున్నారు. వాళ్ల‌లో క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, వాసుప‌ల్లి గ‌ణేష్‌, వ‌ల్ల‌భ‌నే వంశీ, మద్దాల‌గిరి ఉన్నారు. విప్ ప్ర‌కారం అయితే, టీడీపీ అభ్య‌ర్థి అనురాధ‌కు (Panchumarthi Anuradha)వాళ్లు ఓటేయాలి. కానీ, క్రాస్ ఓటింగ్ చేస్తార‌ని వైసీపీ భావిస్తోంది. అలాగే, నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి క్రాస్ ఓటు చేస్తార‌ని టీడీపీ లెక్కిస్తోంది. అంటే, 21 ఓట్లు అనురాధ‌కు ల‌భించే అవకాశం ఉంది. మ‌రో ఓటు వైసీపీ రెబ‌ల్స్ గా ఉన్న ఎమ్మెల్యేల నుంచి ఎవ‌రో ఒక‌రు వేస్తార‌ని టీడీపీ ప్ర‌గాఢ విశ్వాసం. లేదంటే, టీడీపీ రెబ‌ల్స్ గా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రామకృష్ణ‌మూర్తి, మ‌ద్దాల గిరి, వాసుప‌ల్లి గ‌ణేష్ లు వేస్తార‌ని కూడా స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

రామ‌నారాయ‌ణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి క్రాస్ ఓటు చేస్తార‌ని

టీడీపీ రెబ‌ల్స్ మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ వైసీపీ ఎమ్మెల్మేలు తాడికొండ శ్రీదేవి, వసంత కృష్ణ ప్రసాద్ రాత్రి నుంచి అధిష్టానంకు అందుబాటులో లేరు. వాళ్లు ఫోన్ స్విచ్చాఫ్ చేసి వెళ్లిపోయారు. హ‌ఠాత్తుగా పోలింగ్ జ‌రిగే స‌మ‌యానికి ప్ర‌త్య‌క్షం అయ్యారు. దీంతో మాజీ మంత్రి పేర్ని నాని స‌హ‌చ‌ర ఎమ్మెల్యే వసంత ను నిల‌దీశారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది. త‌న‌తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేస్తార‌ని వసంత ప్ర‌క‌టించ‌డంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టీమ్ కు మైండ్ బ్లాక్ అయింది. ఇలాంటి ప‌రిణామాన్ని ఊహించ‌ని వైసీపీ అధిష్టానం జారిపోయే ఎమ్మెల్యేల‌ను క‌ట్ట‌డీ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అంతేకాదు, టీడీపీ అభ్య‌ర్థి(Panchumarthi Anuradha) గెలుపు మీద మైండ్ గేమ్ ఆడుతోంది.

మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్యే వసంత  మ‌ధ్యా వాగ్వాదం

తెలుగుదేశం పార్టీకి ఇటీవ‌ల వ‌ర‌కు దూరంగా ఉంటోన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు ఓటు చెల్ల‌కుండా చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు వైసీపీ లీకులు ఇచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఓట‌ర్ల జాబితా బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత కూడా గంటా ఓటు ఉంది. కానీ, చివ‌రి నిమిషంలో స్పీక‌ర్ త‌మ్మినేని అన‌ర్హ‌త వేటు వేస్తార‌ని ప్ర‌చారం చేసింది. ఒక వేళ అదే జ‌రిగితే, సాంకేతికంగా కొన్ని స‌మ‌స్య‌లు అసెంబ్లీని చుట్టుముట్టే అవ‌కాశం లేక‌పోలేదు. అదే విష‌యాన్ని గంటా శ్రీనివాస‌రావు కూడా చెబుతున్నారు. ఆయ‌న గ‌త ఏడాది స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తూ చంద్ర‌బాబుకు లేఖ పంపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మానికి వెళుతున్న‌ట్టు చెబుతూ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ రోజు నుంచి పెండింగ్ లోనే ఉన్న ఆ ప‌త్రాన్ని ఇప్పుడు స్పీక‌ర్ ఆమోదిస్తార‌ని మైండ్ గేమ్ వైసీపీ ఆడింది.

Also Read : MLC Result Effect : రోజా,పెద్దిరెడ్డితో స‌హా 10 మంది ఔట్‌?

ఒక వేళ గంటా శ్రీనివాస‌రావును అన‌ర్హునిగా ప్ర‌క‌టిస్తే నైతికంగా వైసీపీకి న‌ష్టం అపారంగా జ‌రుగుతుంది. ఒక బీసీ అభ్య‌ర్థిని(Panchumarthi Anuradha) ఓడించ‌డానికి అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌ను తీసుకున్నార‌ని ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. అంతేకాదు, వైసీపీ రెబ‌ల్ ఎంపీగా ఉన్న త్రిబుల్ ఆర్, ఇప్పుడు రెబ‌ల్స్ గా మారిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, గ‌త రెండేళ్లుగా టీడీపీ రెబ‌ల్స్ గా ఉన్న న‌లుగురి మీద కూడా అన‌ర్హ‌త వేటు వేయాలి. అందుకే, గంటా శ్రీనివాస‌రావు ఓటు వేయ‌కుండా వైసీపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డానికి సాహ‌సం చేయ‌లేదు. అలా కాకుండా కేవ‌లం వైసీపీకి అనుకూలంగా ఉండేలా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకుంటే ప్ర‌జాక్షేత్రంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రువు పోతుంది. ఇలాంటి పరిణామాల‌న్నింటినీ ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్ర‌బాబు (TDP MLC) వైసీపీ రెబ‌ల్స్ మీద ముందు నుంచే దృష్టి పెట్టారు. గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకున్న త‌రువాత బీసీ మ‌హిళ అనురాధ‌ను ఎన్నిక‌ల బ‌రిలోకి దింపారు.

కృష్ణ ప్ర‌సాద్ అసెంబ్లీలోనే తిరుగుబాటు (TDP MLC)

ముగ్గురు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాల‌ను కోల్పోయిన వైసీపీ ప్ర‌స్తుతం క‌సిమీద ఉంది. అప‌జ‌యం నుంచి పూర్తిగా కోలుకోకుండానే మ‌రో అప‌జ‌యం ఆ పార్టీని వెంటాడుతోంది. అనైతికంగా టీడీపీ రెబ‌ల్స్ చేత ఓటు వేయించుకుంటోన్న వైసీపీకి అదే అస్త్రంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు బుద్ధి చెప్ప‌బోతున్నారు. అందుకే, సంకేతంగా వైసీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ అసెంబ్లీలోనే మాజీ మంత్రి పేర్ని నాని మీద తిరుగుబాటు క‌నిపిస్తోంది. అంటే, టీడీపీ అభ్య‌ర్థి అనురాధ (Pamchumarthi Anuradha)విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు చాణ‌క్యం అంటే ఏమిటో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి రుచిచూడ‌బోతున్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లో(TDP MLC) సంద‌డి క‌నిపిస్తోంది.

Also Read : Employees Ugadi Gift to Jagan: జగన్ కు ఉద్యోగుల ఉగాది ఝలక్