సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.సామర్ల కోట సభలో సీఎం జగన్ పచ్చి అబద్దాలతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారని అనురాధ ఆరోపించారు. రూ. 43 వేల కోట్లు దోచుకుని 10 ఏళ్ల నుంచి బెయిల్ పై తిరుగుతున్న జగన్ చంద్రబాబు నాయుడిని విమర్శించటం సిగ్గుచేటన్నారు. 2004 ఎన్నికల అఫడవిట్ లో జగన్ ఆస్తుల విలువ రూ. 1 కోటి 30 లక్షలేనని.. నేడు దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్ ఎలా అయ్యారని ఆమె ప్రశ్నించారు. అక్రమ సంపాదనతో పొరుగు రాష్ట్రాల్లో ప్యాలెస్ లు కట్టుకున్న జగన్.. చంద్రబాబుని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. అసలైన దోపిడిదారు, పెత్తందారు, గొజదొంగ జగనేనన్నారు. ఎన్నికల ముందు 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని జగన్ చెప్పారని.. కానీ కేవలం 4 లక్షలు ఇళ్లు కట్టి, చంద్రబాబు నాయుడు కట్టిన 3 లక్షల టిడ్కో ఇల్లు కలిపి తామే 7 లక్షల ఇళ్లు కట్టినట్టు అబద్దాలు చెప్తూ సిగ్గులేకుండా మేం కట్టిన ఇళ్లను పేపర్లలో పోటోలు వేసి ప్రకటనలిస్తున్నారని మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ చెప్పిన లెక్కల ప్రకారం ఇళ్ల స్థలాల పంపిణీకి, ఇళ్ల నిర్మాణానికి రూ. మీ 2 లక్షల కోట్లు అవుతుంది. కానీ నాలుగేళ్ల నుంచి బడ్జెట్ మీరు హౌసింగ్ కి కేటాయించింది కేవలం 23 వేల కోట్లేనని అనురాధ తెలిపారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ. 7 వేల కోట్ల దోపిడి చేసిన పెత్తందారుడు జగనేనన్నారరు. పేదలపై జగన్ కి అంత ప్రేమ ఉంటే.. నాలుగున్నరేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు కట్టిన టిడ్కో ఇళ్లు ఎందుకు పంపిణీ చేయలేదని ఆమె ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల నుంచి భూ కబ్జాలు, మాఫియాలతో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న దోపిడి దారులు, పెత్తందారులు, గజ దొంగలు వైసీపీ వాళ్లేనని అనురాధ ఆరోపించారు. 43 వేల కోట్లు దోచుకుని 10 ఏళ్ల నుంచి జగన్ బెయిల్ పై తిరుగుతున్నారని.. . జగన్ లా చంద్రబాబుకి వ్యవస్ధల్ని మ్యానేజ్ చేయటం రాదన్నారు. వైసీపీ అక్రమాలు, అవినీతి ప్రశ్నిస్తున్నారనే చంద్రబాబు నాయుడిని అక్రమంగా జైల్లో పెట్టారన్నారు.