Site icon HashtagU Telugu

AP Assembly : బాలకృష్ణ ను క్షమించి..వైసీపీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన స్పీకర్

tdp-mlas-suspended-from-ap-assembly-today

tdp-mlas-suspended-from-ap-assembly-today

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (Ap assembly sessions) గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను ముట్టడించారు. ఈ క్రమంలో స్పీకర్ అసెంబ్లీని కాసేపు వాయిదా వేశారు. తిరిగి రెండో సారి ప్రారంభించినప్పటి అదే మాదిరి గందరగోళం నెలకొంది.

ఈ క్రమంలో స్పీకర్ మరోసారి వాయిదా వేశారు. అలాగే టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఓ టీడీపీ నేతను ఏకంగా useless fellow అంటూ ఫైర్ అయ్యారు. అలాగే అసెంబ్లీ లో బాలకృష్ణ మీసం తిప్పడం ఫై కూడా స్పీకర్ స్పందించారు. బాలకృష్ణ ప్రవర్తన అభ్యంతరంగా ఉందని , మొదటి తప్పుగా భావించి ఆయన్ను క్షమిస్తున్నట్టు తెలిపారు. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read Also : Leadership Crisis : తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం?

టీడీపీ సభ్యులకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య స్పీకర్‌ రూలింగ్ ఇచ్చారు. అసెంబ్లీ సొత్తును ధ్వంసం చేసిన సభ్యులు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, పయ్యావులను సమావేశాలు పూర్తి అయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అంతేకాకుండా ధ్వంసమైన వస్తువుల డబ్బులను వారి నుంచే రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌ లపై స్పీకర్ చర్యలు తీసుకోవడంపై టీడీపీ సభ్యులు వ్యతిరేకించారు. ఇదే క్రమంలో సభా వ్యవహారాల మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి లేచి… టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. మిగతా వారి ప్రవర్తన సరిగా లేదని వారిపై కూడా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు సూచించారు. దీంతో స్పీకర్ ఏపీ అసెంబ్లీ నుంచి ఈరోజు వరకు 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్‌ చేసారు.

Exit mobile version