Site icon HashtagU Telugu

AP Assembly : ఏపీ అసెంబ్లీలో ర‌గ‌డ‌… ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్సిటీ పేరు మార్పు..?

Ap Assembly Imresizer

Ap Assembly Imresizer

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బుధవారం ఏపీ అసెంబ్లీ లో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. కాగా ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది. సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.