Site icon HashtagU Telugu

Ganta Srinivasa Rao : గంటా రాజీనామా ఆమోదం..జగన్ స్కెచ్ లో భాగమేనా..?

Ganta

Ganta

అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు..విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం (Speaker Tammineni Sitaram)..దీనిని ఆమోదించలేదు. కానీ సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్పీకర్ రాజీనామాను ఆమోదించడం ఫై టీడీపీ న్యాయ పోరాటం చేసేందుకు దిగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

త్వరలో ఏపీలో ఖాళీ కానున్న 3 రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీకి షాకిచ్చేలా అధికార పార్టీ వైసీపీ భారీ స్కెచ్ వేసింది. రాజ్య సభ ఎన్నికల నాటికి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్యా బలం తగ్గించేందుకు ఇప్పుడు గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు తెలిపినట్లు అర్ధమవుతుంది. స్పీకర్ సీతారం ఆమోదంతో గంటా రాజ్య సభ్య ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కోల్పోయాడు. దీంతో రాజ్య సభ ఎన్నికల్లో టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఓటు తగ్గినట్లు అయ్యింది. ప్రస్తుతం విశాఖ నార్త్‌ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గంటా..రాబోయే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి గంటా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. గంటా రాజీనామా ఆమోదంపై హైకోర్టుకు వెళ్లాలని టీడీపీ భావిస్తుంది.

ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. ఈ కారణంగా బదిలీ అయిన ఎమ్మెల్యేలు.. టిక్కెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపుకు వెళ్తే ఓ రాజ్యసభ స్థానం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఆ పార్టీ ఉంది. అందుకే టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాస్ రాజీనామాను ఆమోదించే ముందు ఆయనను ఒక్క సారి కూడా సంప్రదించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా పెద్దగా తేడా లేదు. ఎందుకంటే నెల రోజులలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే ఈ పని చేశారని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు.

Read Also : SSMB29: మహేష్‌, జక్కన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు