Site icon HashtagU Telugu

TDP MLA Candidate : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో గుంతలరోడ్ల మరమత్తుకు శ్రీకారం..!

Tdp Mla Candidate Amilineni Surendra Babu Doing Road Work His Constituency

Tdp Mla Candidate Amilineni Surendra Babu Doing Road Work His Constituency

TDP MLA Candidate ఎమ్మెల్యే అయ్యాక కాదు గెలవక ముందే ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్నారు టీడీపీ నేత అమిలినేని సురేంద్ర బాబు. ఆయన నియోజకవర్గంలో ఉన్న గుంతల రోడ్లు మరమత్తులు చేయించేందుకు శ్రీకారం చుట్టారు. 30 నుండి 40 జేసీబీలను ఆయా గ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు అమిలినేని సురేంద్ర బాబు బృందం. ఇందుకు సంబందించిన పనులను గ్రామాల కార్యకర్తలకు అప్పగించినట్లు తెలుస్తుంది. వారు మరమత్తు పనులు మొదలు పెట్టారు.

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున కారనంగా ఎన్నికల కోడ్ వచ్చే లోపు రోడ్ల మరమ్మత్తుల పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నుసికొట్టాల తండా, కైరేవు, రాయలదొడ్డి, బొమ్మగానిపల్లి తో పాటు పలు గ్రామాల్లో రోడ్డు పనులు పూర్తి చేశారు.

సురేంద్ర బాబు పోటీ చేస్తున్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గుంతల రోడ్ల వల్ల రవాణా సౌకర్యం చాలా ఇబ్బంది కరంగా ఉంది. వాహన రాక పోకలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ఆయా గ్రామాల ప్రజలకు టీడీపీ ంళా అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అండగా నిలుస్తున్నారు. గుంతల రోడ్లు ఉన్న ప్రతి గ్రామంలోను మరమ్మత్తులు చేయిస్తున్నారు.

ఎన్నికల కోడ్ వచ్చే లోపు రోడ్ల మరమ్మత్తులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గం లో కళ్యాణదుర్గం మండలం నుసికొట్టాల తండా దానితో పాటు శెట్టూరు మండలం కైరేవు గ్రామంలో, బ్రహ్మాసముద్రం మండలం లోని రాయలప్ప దొడ్డి, బొమ్మగానిపల్లి గ్రామాలలో రోడ్డు పనులు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మరమ్మత్తు చేయాల్సిన అన్ని రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నట్లు సమాచారం.