Site icon HashtagU Telugu

MLA Bala Krishna : చంద్ర‌బాబుని ప్ర‌జ‌ల నుంచి దూరం చేసే కుట్ర జ‌రుగుతుంది.. బాబు ఆరోగ్యంపై బాల‌కృష్ణ ఆందోళ‌న‌

Balakrishna

Balakrishna

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్యంపై ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అభివృద్ధిలో చంద్రబాబు ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి జైలు పాల్జేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పగ చల్లారినట్టు లేద‌న్నారు. చంద్రబాబుని ప్రజల నుంచి దూరం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. 73 ఏళ్ల చంద్రబాబు ఆరోగ్యంతో జ‌గ‌న్‌ చెలగాటమాడుతున్నార‌ని.. స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న చంద్రబాబుకి 34 రోజులుగా జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెట్టార‌ని తెలిపారు. ఈ ఇబ్బందుల‌తో చంద్ర‌బాబుని అనారోగ్యంపాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. డాక్టర్ల పేరుతో జైలు సూపరింటెండ్ హెల్త్ రిపోర్ట్ ఇవ్వడం జగన్ రెడ్డి కుటిల రాజకీయం భాగం కాదా? అని బాల‌కృష్ణ ప్ర‌శ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక తెల్లకాగితంపై మీ ఇష్టమొచ్చినట్టు రాసుకుని సంతకం పెట్టే అథారిటీ జైలు అధికారికి ఎవరిచ్చారని మండిప‌డ్డారు. సొంత పార్టీ ఎంపీ రఘురామరాజును శారీరకంగా హింసించి దొంగ రిపోర్టులు ఇచ్చినట్టే చంద్రబాబు విషయంలో చేస్తున్నారని బాల‌కృష్ణ ఆరోపించారు. చంద్రబాబు .. జగన్ రెడ్డిలా అవినీతి చేసి జైలు కెళ్లలేదని.. జగన్ రెడ్డిలా ముద్దాయికాదన్నారు. చంద్రబాబుగారు నెల రోజుల్లో 5 కేజీల బరువు తగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మరో 2 కేజీలు బరువు తగ్గితే ఆ ప్రభావం కిడ్నీలపై పడే అవకాశం ఉందని.. విరిగిన ఎముకులు ఎక్స్ రేలో కనిపించకుండా మ్యానేజ్ చేసే ఘనులకు జగన్ రెడ్డి దగ్గర కొదవేలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రజల్లో ఎమోషన్స్ రాకుండా ఉండటం కోసం ఎంతకు దిగజారేందుకైనా జగన్ రెడ్డి సిద్ధ ప‌డ్డార‌ని ఆరోపించారు. తక్షణమే చంద్రబాబుకు వ్య‌క్తిగత వైద్యులను అనుమతించాలని.. ఎయిమ్స్ లాంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని బాల‌కృష్ణ డిమాండ్ చేశారు.

Also Read:  TDP : చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లూ పెట్టారు – కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు