Site icon HashtagU Telugu

TDP MLA Anagani : మత్య్సకారుల్ని సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి నట్టేట ముంచారు – టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

Tdp Mla Anagani

Tdp Mla Anagani

మత్య్స కారులకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారని.. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. వందల బోట్లు, వేలాదిమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణం జరపడంలేదు కాని రుషికొండలో రూ 500 కోట్లతో జ‌గ‌న్ విలాస భవనం కట్టుకుంటున్నారన్నారు. జగన్ రెడ్డి తన సలహాదారుల కోసం చేసే ఖర్చులో సగం కూడా మత్య్స కారులకు ఖర్చు చేయడం లేదని అన‌గాని ఆరోపించారు .రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారని విషయం కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారని.. మత్స్యకార భరోసా (10 వేలు) నగదు తీసుకునేవారు వృద్ధాప్య పింఛన్‌కు అర్హులుకారని చెప్పి వారి పింఛను రద్దుచేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. మత్స్యకారులకు ఇచ్చే అరకొర సాయానికి కూడా జగన్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోందని.. అమ్మఒడి తీసుకుంటే మత్స్యకార భృతి ఇవ్వబోమని, ఇతర పథకాలు పొందితే అర్హులు కారని చెబుతూ, కడలి పుత్రుల కడుపు కొడుతోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఒక కుటుంబంలో నలుగురు చేపలవేటకు వెళితే, వారిలో ఒకరికే మత్స్యకార భృతి ఇవ్వడం అన్యాయమ‌న్నారు. మైదాన ప్రాంత మత్స్యకారుల పొట్టకొడుతున్న జీఓఆర్‌టీ నెం. 217ను ప్రభుత్వం తీసుకొచ్చి మత్స్యకారులను వృత్తి నుండి దూరం చేసే కుట్ర చేస్తోందని అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ఆరోపించారు. మినీ హార్బర్ నిర్మాణం జగన్ హయాంలో పేపర్లకే పరిమితమైందని. ప్రాణాలకు తెగించి సముద్రంపై చేపల వేట సాగించే వారికి జెట్టీ చేపల వేట ఆధారంగా జీవిస్తున్న మత్స్యకారులను సముద్రానికి దూరం చేస్తారా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని సునాయాసంగా ఎదుర్కునే మత్సకారులు వైసీపీ ప్రభుత్వ అక్రత్యాలకు బలవుతున్నారని.. ఫిష్ ఆంద్ర ఔట్ లెట్ షాపులు తెచ్చి మత్య్సకారుల జీవనోపాధి దెబ్బ తీశారన్నారు. మత్స్యకారులకు జగన్ రెడ్డి చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ తెలిపారు.

Also Read:  Srikanth Goud : పరారీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్