పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో చిల్లర రౌడీల్లా వ్యవహరిస్తూ రాష్ట్ర పరువు తీస్తున్నారన్నారు. పార్లమెంట్ లో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి వ్యవరించిన తీరు రాష్ట్ర ప్రతిష్టకే మాయని మచ్చని.. బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుపై పరుష పదజాలం ఉపయోగిస్తూ.. మిధున్ రెడ్డి దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. సీఎం జగన్ మాదిరి వైసీపీ ఎంపీలు కూడా అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారని.. దేశ ప్రజల ప్రయోజనాల కోసం చట్టాలు చేసే పార్లమెంట్ లో మిధున్ రెడ్డి చిల్లర రౌడీ మాదిరి వ్యవహరించారన్నారు. వైసీపీ ఎంపీలకు చేతనైనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరాడాలి అంతే తప్ప చిల్లర రౌడీల్లా వ్యవహరించి రాష్ట్ర ప్రతిష్ట మంటగలపొద్దని కోరారు పార్లమెంట్ నిభంధనలు ఉల్లంఘించి సాటి ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మిధున్ రెడ్డిపై స్పీకర్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TDP MLA : వైసీపీ ఎంపీలు రాష్ట్రం పరువు తీస్తున్నారు : టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్

Tdp Mla Anagani