అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు

TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు

Published By: HashtagU Telugu Desk
Tdp Membership

Tdp Membership

ఈ నెల 26వ తేదీ నుంచి TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం (TDP Membership Registration Program) చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 5లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని, చనిపోయిన కార్యకర్తకు మట్టి ఖర్చుల కింద అదనంగా రూ. 10వేలు ఇస్తామని MLA, MP, MLCలతో జరిగిన భేటీలో వెల్లడించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.ప్రభుత్వం చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్ట నష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా, ఇంతగా అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదన్న చంద్రబాబు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదని ఈ వ్యత్యాసాన్ని గమనించాలని సూచించారు.

Read Also : VIRAL: బికినీలో మృణాల్.. అసలు పిక్ ఇదే ..!!

  Last Updated: 18 Oct 2024, 08:24 PM IST