Chandrababu: గ‌వ‌ర్న‌ర్‌ని అవ‌మానించ‌డం వెనుక ఉన్న.. చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్ ఇదే..!

  • Written By:
  • Publish Date - March 8, 2022 / 03:14 PM IST

టీడీపీ అధినేత‌ చంద్రబాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు రావొచ్చ‌ని, అందుకు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇత‌ర పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే, ముందుగానే సిద్ధంగా ఉండాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు త‌న స్ట్రాట‌జీని పూర్తిగా మార్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

గ‌త ఎన్నిక‌లక ముందు పాలు నీళ్ళ‌లా బీజేపీతో క‌లిసి ఉన్న టీడీపీ, కరెక్ట్‌గా ఎన్నిక‌ల స‌మ‌యంలో, బీజేపీతో బంధానికి తెగ‌తెంపులు చేసుకుని, హ‌స్తంతో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. దీంతో చంద్ర‌బాబుకు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. 2019 ఎన్నిక‌ల నేప‌ధ్యంలో చంద్ర‌బాబు వేసిన మాస్ట‌ర్ ప్లాన్స్ అన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో మ‌రోసారి అధికారం చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు కొత్త స్ట్రాట‌జీతో ముందుకు సాగనున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో ఎవ‌రితో పొత్తులు పెట్టుకోవాల‌నే దానిపై ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని టీడీపీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొన్నాళ్ళుగా బీజేపీతో దోస్తీకి టీడీపీ విశ్వ‌ప్ర‌యాత్నాలు చేస్తూనే ఉంది.. అయితే కాషాయం పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. మ‌రోవైపు వైసీపీ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్న‌ట్టు చంద్ర‌బాబుకు స‌మాచారం అందిద‌ని, దీంతో బీజేపీకి దూరంగా వెళ్ళాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. బీజేపీ ఏపీలో పెద్ద‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం అయితే ఎలాగూ లేదు.

ఈ నేప‌ధ్యంలో జ‌న‌సేన‌, క‌మ్యునిస్టులను క‌ల‌పుకుని ఎన్నిక‌ల బ‌రిలోకి దిగితే సానుకూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే మార్చి7న ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకున్నార‌ని తెలుస్తుంది. గ‌తంలో ఎప్పుడూ టీడీపీ ఇలా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకోలేదు.. అయితే గ‌వ‌ర్న‌ర్‌ను అవ‌మానిస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అవ‌మానించిన‌ట్టే అని, ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు బీజేపీతో యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారని, రాజ‌కీయ‌విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీతో క‌య్యానికి సిద్ధంగా ఉంద‌ని చంద్ర‌బాబు సంకేతాలు పంపించారు. మ‌రి చంద్ర‌బాబు న‌యా స్ట్రాట‌జీ టీడీపీకి ఎంత‌వ‌ర‌కు మేలు చేస్తుంద‌నేది చూడాలి.