TDP : సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా.. కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు

సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని.. టీడీపీ పిలుపునిచ్చిన రా.. కదలిరా

Published By: HashtagU Telugu Desk
TDP

TDP

సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని.. టీడీపీ పిలుపునిచ్చిన రా.. కదలిరా కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన రా..కదలిరా కార్యక్రమం బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఐదేళ్ల‌లో జగన్ పాలనలో ప్రజలు నరకం అనుభవించారని.. ఈ నూతన సంవత్సరంలో సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపి మనకు మంచి రోజులు రావాలని సంకల్పం చేద్దామ‌న్నారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటే అది ప్రభంజనం అయిందని.. ప్రజలే సారధ్యం వహించి తెలుగుదేశాన్ని గెలిపించారన్నారు. నేడు సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలిరా అని పిలుపునిస్తున్నా… ఇది మనందరి సమిష్టి బాధ్యత అని చంద్ర‌బాబు తెలిపారు. ప్రపంచంలో తెలుగు జాతి నెం.1 కావాలి, అందుకు తగ్గ సత్తా తెలివితేటలు మనదగ్గర ఉన్నాయి.. కానీ నేడు రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదు, చైతన్యం ఉన్న తెలుగు జాతి భయపడే పరిస్ధితి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని సాగనంపి తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నార‌ని ఎద్దేవా చేశారు. గ్రామ పెద్ద చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం నాశనమవుతుంద‌ని.. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి సైకో అయితే రాష్ట్రం ఏమవుతుందో ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. జగన్ రెడ్డి పాలనలో అందరూ బాధితులేన‌ని.. భర్త కళ్లదుటే మహిళలకు రక్షణ లేకుండా పోయింద‌న్నారు. మొన్న విశాఖలో ఒక యువతిని 11 మంది అత్యాచారం చేశారంటే.. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాల్సిన అవ‌సరం ఉంద‌న్నారు. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగాలిస్తే నేడు జగన్ గంజాయి ఇస్తున్నార‌ని ఆరోపించారు. నాడు ఐటి ఉద్యోగాలిస్తే జగన్ రెడ్డి రూ. 5 వేల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారని.. వైసీపీ పాలనలో నిత్యసర ధరలన్నీ పెరిగాయి, సామాన్యుడు బ్రతికే పరిస్ధితిలేదన్నారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నింటిలో దోపిడికి పాల్పడుతున్నాడ‌ని. ఆయన్ని ఎందుకు మార్చలేదని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. యర్రగొండపాలెంలో మంత్రి బట్టలిప్పి తిరిగాడ‌ని.. ఆయన్ని కొండపికి మార్చారన్నారు. యర్రగొండపాలెం చెత్త తీసుకెళ్లి కొండపిలో వేస్తే బంగారం అవుతుందా? అని ప్ర‌శ్నించారు. మార్కాపురం ఎమ్మెల్యే నయీం, వాళ్ల తమ్ముడు చోటా నయీం అని అక్కడి ప్రజలే అంటున్నారని చంద్ర‌బాబు అన్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే పోటీచేయలేనని పారిపోయాడని.. జగన్ తాను చేసిన తప్పులకు తన ఎమ్మెల్యేలను బలిపశుల్ని చేశార‌న్నారు.

Also Read:  Gitam Student Suicide : గీతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ..వీడియో వైరల్

  Last Updated: 05 Jan 2024, 09:57 PM IST