Site icon HashtagU Telugu

TDP Mahanadu 2025 : ఈసారి ‘మహానాడు’ మాములుగా ఉండదు

Tdp Mahanadu 2025

Tdp Mahanadu 2025

తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి ప్రాణసమానమైన కార్యక్రమం అయిన మహానాడు ఈ సంవత్సరం మరింత ప్రత్యేకతతో జరగనుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు (Mahanadu) రాజకీయ, సాంస్కృతికంగా పార్టీకి కొత్త ఊపును ఇస్తుంది. అయితే ఈసారి మహానాడుకు రెండు కీలక కారణాల వల్ల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఒకవైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) 75 వసంతాల ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భం, మరోవైపు కూటమి ప్రభుత్వానికి బలమైన మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఉత్సాహవంతంగా ఈ మహానాడును నిర్వహించనుంది.

Vijay : దిగజారిన తమిళ రాజకీయం.. స్టార్ హీరోకు తెలుగు డైరెక్టర్ తో సినిమా తీయొద్దని చెప్పారట..

ఈ ఏడాది మరో విశేషం ఏమిటంటే.. మహానాడు తొలిసారి కడప (kadapa) జిల్లాలో జరగనుంది. రాజకీయంగా కడప వైసీపీ పటిష్టంగా ఉండే జిల్లాగా పేరొందినప్పటికీ, ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కీలక నియోజకవర్గాల్లో విజయాలను సాధించింది. ఈ సానుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేసేందుకు, పార్టీని కడపలో శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో అక్కడే మహానాడును నిర్వహించేందుకు టీడీపీ నిర్ణయించింది. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా స్థానిక కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలనే లక్ష్యాన్ని పార్టీ పెట్టుకుంది.

ఈసారి సుమారు 5 లక్షల మందిని మహానాడుకు తరలించాలనే లక్ష్యంతో మండల స్థాయి నుంచి మొబిలైజేషన్ జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఏడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించగా, ఇంకా అనేక ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భోజనాలు, వసతి, అతిథుల ఆహ్వానం, సౌకర్యాలు వంటి విభాగాలకు ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఐటీడీపీ కార్యకర్తలకు ప్రచార బాధ్యతలు అప్పగించగా, కడప ప్రజాప్రతినిధులకు ప్రత్యేక నిర్వహణ కేటాయించారు. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఈ మహానాడును పార్టీ శక్తి ప్రదర్శనగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.