Site icon HashtagU Telugu

TDP Mahanadu 2023 : మహానాడులో నోరూరించే వంటలు.. ఏమేమి పెట్టారో తెలుసా? ఇన్ని లక్షల మందికి వంటలు ఎవరు వండుతున్నారు?

TDP Mahanadu 2023 Special food for TDP Leaders and members

TDP Mahanadu 2023 Special food for TDP Leaders and members

తెలుగుదేశం(Telugudesham) పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ సారి మరింత ఘనంగా చేస్తున్నారు. ఈసారి ఎన్టీఆర్ శత జయంతి(NTR 100 Years) కూడా కావడంతో గతంలో కంటే భారీగా, గ్రాండ్ గా మహానాడు(Mahanadu)కి నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలో నేడు, రేపు (మే 27, 28) మహానాడు జరుగుతుంది. ఇక మహానాడులో వంటకాలు కూడా భారీగానే ఉంటాయి. అదిరిపోయే వంటకాలను నాయకులకు, కార్యకర్తలకు అందచేస్తారు. ఈ సారి మహానాడు ఫుడ్ కమిటీ సభ్యులుగా నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూలు ఉన్నారు. తొలిరోజు లక్షమంది, రెండో రోజు దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని తెలిపారు పార్టీ నాయకులు.

నేడు మే 27న మహానాడుకి హాజరైన నేతలు, కార్యకర్తలకు ఉదయం టిఫిన్ లో ఇడ్లీ, వడ, పొంగల్, టమాటా బాత్, పునుగులు, మైసూర్ బజ్జి, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబార్ సిద్ధం చేశారు. ఇక మధ్యాహ్నం భోజనంలో కాకినాడ కాజా, తాపేశ్వరం గొట్టం కాజా, యాపిల్ హల్వా, జిలేబి, వెజ్ బిర్యానీ, బెంగాల్ అదుప కుర్మా, వెజిటేబుల్ మిక్స్ కర్రీ, బెండకాయ ఫ్రై, మామిడికాయపప్పు, దొండకాయ ఫ్రై, గుత్తి వంకాయ, గోంగూర చట్నీ, ఆవకాయ, దోస ఆవకాయ, సాంబార్, మజ్జిగ పులుసు, పెరుగు ఉన్నాయి.

ఇక రేపు మే 28న ఉదయం ఈ రోజు పెట్టిన మెనూనే కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం నాయకులకు, ముఖ్యమైన క్యాడర్ కు ఇవాళ్టి భోజనం మెనూనే ఉంటుంది. ఇక లక్షల్లో కార్యకర్తలు వస్తుండటంతో వారి కోసం రేపు మధ్యాహ్నం సాంబార్ రైస్, చక్కర పొంగలి, పెరుగన్నం ఏర్పాటు చేశారు. ఇక భోజల దగ్గర 10 లక్షల వాటర్ సీసాలు, మరో పది లక్షల వాటర్ ప్యాకెట్స్ సిద్ధం చేశారు. ఇవి కాకుండా రేపు మధ్యలో కార్యకర్తలకు ఇవ్వడానికి 10 లక్షల మజ్జిగ ప్యాకెట్స్ ని కూడా రెడీ చేస్తున్నారు.

ఇక ఇన్ని లక్షల మందికి వంటకాలు విజయవాడకు చెందిన కిలారు వెంకట శివాజీకి చెందిన అంబికా క్యాటరింగ్ తరపున 1500 మంది పనివాళ్ళు నాలుగు రోజుల నుంచి ఈ పనుల్లో నిమగ్నమయి చేస్తున్నారు.

 

Also Read : TDP Mahanadu 2023: సైకో జగన్ ఏపీని నాశనం చేశాడు : చంద్రబాబు