Site icon HashtagU Telugu

TDP : జగన్ రెడ్డి లాంటి అవినీతిపరులు, దోపిడీదారులకు తలవంచను – టీడీపీ నేత బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి

Bandaru Jagan

Bandaru Jagan

సీఎం జ‌గ‌న్‌, మంత్రి రోజాపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారంటూ టీడీపీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి బండారు స‌త్యనారాయ‌ణ‌ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన‌కు ఈ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ ప‌రిణామాల‌పై స‌త్య‌నారాయ‌ణ‌ మూర్తి మీడియాతో మాట్లాడారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎక్కడా మచ్చుకు కూడా అమలు కావడం లేదన్నారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే అందుకు నిదర్శనమ‌న్నారు. త‌మ నాయకుడితో పాటు కీలకమైన టీడీపీనేతలపై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసుల్ని అస్త్రాలుగా ప్రయోగిస్తోందని ఆయ‌న ఆరోపించారు

We’re now on WhatsApp. Click to Join.

జగన్ సర్కార్ నాపై పెట్టిన తప్పుడు కేసులో న్యాయదేవత త‌న‌కు అండగా నిలిచిందని.. జాతిపిత గాంధీ మహాత్ముని జయంతి నాడే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డార‌న్నారు. భయపెట్టి, అక్రమకేసులతో టీడీపీ నేతల గొంతులు నొక్కేయాలని చూస్తున్నార‌ని. ఉరికంబం ఎక్కడానికైనా తాము సిద్ధంగానీ.. జగన్ రెడ్డి లాంటి అవినీతిపరులు, దోపిడీదారులకు తలవంచమ‌ని ఆయ‌న తెలిపారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏనాడూ ఇలాంటి పరిస్థితులు చూడలేద‌ని..త‌న‌ ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ పేరుతో త‌న‌ను అదుపులోకి తీసుకొని గుంటూరు తీసుకొచ్చారని తెలిపారు. ఈ ప్రభుత్వం ఉండేది 5 నెలలేన‌ని అధికారులు, వైసీపీ నేత‌లు గుర్తు పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు.

Also Read:  Delhi Tour for favour : `కృష్ణా`లో జ‌గ‌న్ .! వాటా గోవిందా.?

తల్లి భువనేశ్వరమ్మను అకారణంగా అసెంబ్లీలో అనరాని మాటలు అన్నప్పుడు జగన్ రెడ్డికి, మంత్రులకు, వైసీపీ వారికి ఆమె మహిళని గుర్తుకు రాలేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను మాట్లాడిన దాన్ని తప్పు పట్టారని.. త‌న వ్యాఖ్యలకు ఎంతమంది ప్రజలు మద్ధతిచ్చారో, ముఖ్యంగా ఎందరు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలన్నారు. తాను రోజాపై మాట్లాడేటప్పుడు త‌న‌కు ఇద్దరు కూతుళ్లున్నారు అని చెప్పానని.. మహిళల్ని ఎంతో గౌరవించే సంస్కృతి త‌మ పార్టీకి, క‌టుఉంబానికి ఉంద‌న్నారు. మంత్రి స్థానంలో ఉండి రోజా మాట్లాడిన మాటల్ని తేలిగ్గా తీసుకోలేకపోయాన‌ని.. ప్రభుత్వంలో ఇంకొందరు మహిళా మంత్రులున్నారు.. వారినెవరినీ తాను ఎప్పుడూ ఏమీ అనలేదన్నారు. రోజాను జగన్మోహన్ రెడ్డి కట్టడి చేయ‌క‌పోతే ఆయనకు, ఆయన పార్టీకే నష్టమ‌న్నారు.