TDP : టీడీపీ లో మొదలైన రాజీనామాల పర్వం..

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 05:15 PM IST

టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి తొలి జాబితాలో విడుదలైందో లేదో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ – జనసేన పార్టీలో ఆగ్రహపు జ్వాలలు ఊపందుకున్నాయి. టికెట్ దక్కని నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తాజాగా విశాఖ పశ్చిమ సెగ్మెంట్ టికెట్ రాకపోవడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. గజపతినగరం టీడీపీ ఇన్ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేసారు. కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఆయన పార్టీని వీడారు.

అలాగే రాయచోటి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రమేశ్ రెడ్డి అనుచరులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. మరోపక్క జనసేన పార్టీ కి 24 స్థానాలే ఇవ్వడం ఫై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఇదే సందర్బంగా వైసీపీ నేతలు సైతం పవన్ కళ్యాణ్ ఫై ఓ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ను బయటకు తీస్తూ..అప్పుడలా..ఇప్పుడలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా.. ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో కొంతమందికి అనూహ్యంగా చోటుదక్కడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవలే పార్టీలో చేరిన అమరావతి రైతు ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేష్‌లకు తొలి జాబితాలోనే చోటు దక్కడం.. వీరికి టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. సీనియర్ నేతలకు సైతం స్థానం దక్కని తొలిజాబితాలోనే వీరి పేర్లు ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది. తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావును బరిలో దించుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. కొలికపూడి గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించేవారు.. ఆ తర్వాత అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షులు ఉన్నారు. ఇక ఇటీవలే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో తిరువూరు నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అప్పటికి తిరువూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న నల్లగుట్ల స్వామిదాస్.. జగన్‌ను కలిసి వైసీపీలో చేరిపోయారు. దీంతో టీడీపీ నుంచి తిరువూరు టికెట్ కొలికిపూడి శ్రీనివాసరావుకు దక్కింది. అలాగే మహాసేన రాజేష్‌‌గా ఫేమస్ అయిన సరిపెళ్ల రాజేష్‌ను పి.గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతున్నట్లు టీడీపీ ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో రాజేష్ వైసీపీ కి అనుకూలంగా వ్యవహరించారు.

జగన్‌కు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకీ రాజేష్ దూరమయ్యారు. ఆ తర్వాత మహాసేన పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌ ఛానెళ్లలో వైసీపీ సర్కారు మీద విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆ రకంగా మహాసేన రాజేష్‌గా గుర్తింపు పొందారు. సుమారు ఏడాది కిందట మహాసేన రాజేష్ టీడీపీలో చేరారు. జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన సైకిలెక్కారు. ఈ నేపథ్యంలో మహాసేన రాజేష్‌కు సైతం తొలి విడతలోనే టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇలా సీనియర్లకు కాకుండా కొత్తగా పార్టీ లో చేరిన వారికీ టికెట్లు ఇవ్వడం ఫై సీనియర్లు , టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి రాజీనామాలు చేసిన నేతలను టీడీపీ క్యాడర్ బుజ్జగించే పని చేస్తుందా..లేదా అనేది చూడాలి.

Read Also : GHMC Deputy Mayor Srilatha : బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి