TDP Leaders Protest at Undi : ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్..

ఉండి నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 400 మంది పార్టీకి రాజీనామా చేసి..ఆ లేఖ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు

Published By: HashtagU Telugu Desk
Undi

Undi

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ (TDP) కి వరుస షాకులు ఎదురవుతున్నాయి. కూటమిలో భాగంగా టీడీపీ పలు స్థానాల్లో జనసేన , బిజెపి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేసరికి..ఆ స్థానాల టికెట్ ను ఆశించిన నేతలు..టికెట్ రాకపోయేసరికి పార్టీని వీడడం..లేదా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి , వైసీపీ లో చేరగా..తాజాగా ఉండి (Undi) నియోజకవర్గంలో టీడీపీ కి భారీ షాక్ తగిలింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 400 మంది పార్టీకి రాజీనామా చేసి..ఆ లేఖ ను రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అందజేశారు. వీరంతా మూకుమ్ముడిగా రాజీనామా చేయడానికి కారణం ఉండి నియోజకవర్గ టికెట్‌ను ఇటీవలే పార్టీలో చేరిన రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు కేటాయించడమే.

We’re now on WhatsApp. Click to Join.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే రామరాజును కాదని..ఇటీవల చేసిన రఘురామకృష్ణరాజు ఎలా ఇస్తారని చెప్పి వారంతా అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…రాజీనామా చేసారు. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు నిర్ణయాన్ని మార్చుకోవాలని, ఒకే వేళ ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజునే ప్రకటిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రామరాజు వర్గీయులు హెచ్చరించారు. మరి రామరాజు వర్గీయుల హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకుంటరా..లేదా అనేది చూడాలి. మరోవైపు కర్నూలు జిల్లాకు చెందిన కెఈ కుటుంబం టీడీపీని వీడబోతున్నట్లు తెలుస్తుంది. కేఈ ప్రభాకర్‌కు సీటు రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. దీంతో టీడీపీ అధినాయకత్వం కేఈ కుటుంబాన్ని బుజ్జగించేందుకు నేతలను రంగంలోకి దింపినట్లు సమాచారం.

Read Also ; CM Revanth Reddy : ప్ర‌జ‌లంద‌ర్నీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్ పార్టీని రాజ‌కీయంగానే బొంద పెడుతాం – కేటీఆర్

  Last Updated: 10 Apr 2024, 04:06 PM IST