AP TDP : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ పై పుస్తకాన్ని ఆవిష్క‌రించిన టీడీపీ నేత‌లు

‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ అనే పుస్తకాన్ని టీడీపీ నేతలు ఆవిష్క‌రించారు.

  • Written By:
  • Publish Date - October 6, 2023 / 05:58 PM IST

‘స్కిల్ పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడిచేయడమే’ అనే పుస్తకాన్ని టీడీపీ నేతలు ఆవిష్క‌రించారు. మంగ‌ళ‌గిరిలో టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడులు ఆవిష్క‌రించారు. నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితాన్ని ప్రజలకోసమే అంకితం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబునాయుడిని 28 రోజులుగా జైల్లోనే ఉంచారని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్ర‌బాబు అరె స్ట్ చేసినప్పటినుంచీ నేటివరకు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, టీడీపీ అధినేత ఏ తప్పు చేయలేదనే నిజాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ దుష్ప్రచారం చేస్తూ, లేని అవినీతిని ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తూనే ఉందని ఆయ‌న ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చెప్పారని.. అలానే ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అంశాల్లో కూడా అవినీతి జరిగిందని విషప్రచారం చేస్తున్నారన్నారు. వాటన్నింటికీ సంబంధించి ఇప్పటికే టీడీపీ ప్రజలకు అనేక వాస్తవాలు తెలియచేసిందని.. తాజాగా నేడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన అన్నివిషయాలు వెల్లడిస్తూ నేడు ఒక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామ‌ని తెలిపారు. అలానే ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అంశాలను కూడా ప్రజలకు తెలియచేసేందుకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారంతో పుస్తకాలు విడుదల చేయబోతున్నామ‌ని అచ్చెన్నాయుడు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.3,300కోట్ల అవినీ తి జరిగిందని మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడార‌ని. తర్వాత రూ.330కోట్ల అవినీతి అని కారు కూతలు కూశార‌ని అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. నిన్నటికి నిన్న ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి రూ.27కోట్లు టీడీపీ ఖాతాకు వెళ్లాయంటున్నారని.. పొన్నవోలు మతి చలించి పిచ్చి పిచ్చిగా మాట్లాడార‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అకౌంట్ కు వచ్చిన నిధులకు.. ప్రభుత్వం చెబుతున్న అవినీతికి ఏం సంబంధం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జగన్ రెడ్డి చేసినట్టు అవినీతి చేసి, ఆయన సొంత ఖాతాకో.. ఆయన సంస్థల ఖాతాలకో.. ఆయన భార్య ఖాతాకో నిధులు రాబట్టుకుంటే, అదీ అసలైన అవినీతి అని తెలిపారు.

Also Read:  Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు