ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీకి కంచుకోటగా భావించే పులివెందులలో 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగరవేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఈ విజయంపై టీడీపీ, కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి లభించిన గెలుపని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.
Pulivendula ZPTC Results : డిపాజిట్ గల్లంతు అవుతుందని వైసీపీకి ముందే తెలుసా..?
ఈ విజయంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , అలాగే రఘురామకృష్ణరాజుతో పాటు పలువురు మంత్రులు స్పందించారు. నారా లోకేశ్ మాట్లాడుతూ.. పులివెందుల ప్రజలు వెనుకబాటుతనాన్ని వదిలి అభివృద్ధికి మద్దతు పలికారని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత అక్కడ నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేశారని అన్నారు. నారా భువనేశ్వరి కూడా విజేత లతా రెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రజాస్వామ్యానికి, కూటమిపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
Arjun Bark Water: అర్జున బెరడు నీరుతో ఎన్ని ప్రయోజనాలు !!
మంత్రి అనగాని సత్యప్రసాద్, నారాయణ, డోలా బాల వీరాంజనేయస్వామి సైతం ఈ విజయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఈ ఎన్నిక దశాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసిందని, ఇది జగన్ అహంకారానికి చెంపదెబ్బ అని విమర్శించారు. మంత్రి నారాయణ అభివృద్ధి, సంక్షేమం గెలిచాయని పేర్కొనగా, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఈ విజయం ద్వారా పులివెందులలో రౌడీ రాజకీయాలు ఇక చెల్లవని వారు హెచ్చరించారు. ఈ ఫలితాలు వైఎస్సార్సీపీ నాయకత్వానికి కనువిప్పు కలిగించాలని వారు సూచించారు.