Site icon HashtagU Telugu

TDP : “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేత‌లు

TDP

TDP

వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక బీసీల‌పై ఎక్కువ‌గా దాడులు జ‌రిగాయని టీడీపీ నేత‌లు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” అనే పుస్తకాన్ని రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, బీసీ నేత‌లు ఆవిష్క‌రించారు. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక స్వర్ణ యుగం ప్రారంభమైందని అచ్చెన్నాయుడు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అవకాశాలను తెలుగుదేశం పార్టీ కల్పించిందని… అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం బలహీన వర్గాల వారకి అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనేన‌ని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాల పార్టీ. అందుకే వారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి జగన్ రెడ్డి వరకు కోపమ‌ని.. వైఎస్ కుటుంబం ఉక్కు పాదంతో బలహీన వర్గాల ప్రజలను అనిచివేస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

బలహీన వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్యను చంపి అతనికి సంబంధించిన మైన్స్‌ను స్వాధీనం చేసుకొని ఆర్థికంగా బలపడి, వారి పునాదులపైన పుట్టిన కుటుంబమే వైఎస్ కుటుంబమ‌న్నారు. భూటకపు మాటలు చెప్పి అధికరంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాలపై జగన్ రెడ్డి. ఊచ‌కోత ప్రారంభించార‌ని.. 74 మంది బలహీన వర్గాల వారు వైసీపీ ప్ర‌భుత్వంలో హ‌త్య కాబ‌డ్డార‌ని తెలిపారు.దాదాపు 800 మందిపైగా బలహీన వర్గాల వారిపై అక్రమ కేసులు బనాయించారని. 3000 మందిపై దాడి చేసి ఇబ్బందులు పెడుతున్నార‌ని తెలిపారు జగన్ రెడ్డి అరాచకాలు, అక్రమాలు, దోపిడీలను మేము ప్రశ్నింస్తుంటే త‌మ‌పై అక్రమ కేసులు పెడుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో బలంగా ఉన్న బలహీన వర్గాల వారిపై ఇబ్బడిముబ్బడుగా తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతన్నాడని ప్రజలు గమనించాలని కోరారు.

Also Read:  TDP : తెర వెనుక త‌మ్ముడితో జ‌గ‌న్ రెడ్డి ఇసుక దోపీడి : మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు