Site icon HashtagU Telugu

Chandrababu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌

TDP

TDP

రాజమహేంద్రవరం కేంద్ర కాగారారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏదైనా జరిగితే సీఎం జగన్ దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని య‌న‌మ‌ల ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి ఇచ్చిన నివేదికలో ఏముంది.? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులిటెన్ బయటకు ఇచ్చారని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుండీ ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నార‌ని య‌న‌మ‌ల ఆరోపించారు. హెల్త్ బులిటెన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలి..కానీ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నార‌ని,. డాక్టర్లు పరిశీలించినట్లుగా ఆరోగ్య బులిటెన్ లో లేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్ప డాక్టర్లు పరీక్షలు చేసినట్లు బులిటెన్ లో లేదు. డిప్యూటీ సూపరింటెండెంట్ తన సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారని య‌న‌మ‌ల ఆరోపించారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కుడున్నాయో బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. జైలులో చంద్రబాబు ఉండే రూము, అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంక్ కు బోరు నీళ్లు వెళ్తాయి.. ఆ ట్యాంకు శుభ్రం చేస్తున్నారో లేదో తెలీదని.. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత..ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలని యనమల అన్నారు.

Also Read:  Hyderabad : బోయిన్‌పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య

Exit mobile version