Venigandla Ramu : గుడివాడ కు ఏంచేసావో చెప్పే ధైర్యం ఉందా..? అంటూ నానికి వెనిగండ్ల రాము సవాల్

‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ ప్రశ్నించారు.

Published By: HashtagU Telugu Desk
Ramu Vs Nani

Ramu Vs Nani

ఏపీలో ఇక అసలైన ఎన్నికల హోరు మొదలైంది..నిన్నటి వరకు ఓ లెక్క..ఈరోజు నుండి ఓ లెక్క అంటున్నారు కూటమి నేతలు. ఈరోజు నుండి నామినేషన్ల పర్వం మొదలు కావడం తో అసలైన ప్రచారం..మాటల తూటాలు..సవాల్ కు ప్రతి సవాల్ ఎలా ఉంటుందో అధికార పార్టీ నేతలకు చూపించబోతున్నాం అంటూ చెపుతున్నారు. ఈ తరుణంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి (Gudivada MLA Kodali Nani) నానికి అసలైన సవాల్ విసిరారు కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము (TDP Leader Venigandla Ramu). ‘‘గుడివాడకు ఏం చేశాడో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా’’ అంటూ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ లోకి వలసల పర్వం మరింత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే అగ్ర నేతలు టీడీపీ లో చేరగా..ఇక ఇప్పుడు కింది స్థాయి నేతలు , కార్యకర్తల వంతు మొదలైంది. ప్రతి రోజు ప్రతి నియోజకవర్గాల్లో వందలాది మంది టీడీపీ లో చేరుతూ..ఆయా నియోజకవర్గంలో కూటమి బలం పెంచుతున్నారు. సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అభివృద్ధి తెలియని జగన్ ప్రభుత్వం ఈసారి కుప్పకూలడం ఖాయమని భావిస్తున్న నేతలంతా ఆ పార్టీకి దూరమవుతున్నారు. గురువారం గుడివాడ లో వెనిగండ్ల రాము సమక్షంలో భారీ సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. 19వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ గణపతి సూర్జంతో పాటు 100 మంది యువత టీడీపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ.. ఎన్ని నిధులు తెచ్చి గుడివాడ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పలేము కానీ – జూద క్రీడలు, గంజాయి విక్రయాలు, మట్టి మాఫియా, రియల్ మాఫియాలలో గుడివాడలో ఎంతో అభివృద్ధి చేశారంటూ నాని ఫై ఎద్దేవా చేశారు. బూతులు తిడుతూ నోరేసుకొని పడిపోవడం కాదని, ప్రచారంలో తమ సమస్యలపై ఎక్కడికక్కడ ప్రజల నిలదీతలపై దమ్ముంటే మాట్లాడాలన్నారు. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా నీటి కష్టాలు, రోడ్ల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని..అవన్నీ నేను తీరుస్తా అంటూ వారందరికీ హామీ ఇచ్చారు.

Read Also : World’s Best Airports : ప్ర‌పంచంలో అత్యుత్త‌మ ఎయిర్‌పోర్టులు ఇవే.. మ‌న దేశంలో ఎన్ని ఉన్నాయంటే..?

  Last Updated: 18 Apr 2024, 04:42 PM IST