Site icon HashtagU Telugu

TDP : వ‌రుపుల రాజా భౌతిక‌కాయ‌నికి నివాళ్లు అర్పించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు

Varupula Raja

Varupula Raja

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వ‌రుపుల రాజా ఆక‌స్మిక మ‌ర‌ణంపై చంద్ర‌బాబు తీవ్ర ద్రిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. వరుపుల రాజా భౌతిక కాయానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న రాజా మరణం తీరని లోటు అన్నారు. రాజా ఎప్పుడూ ప్రజల్లో ఉంటారని… కార్యకర్తలను కలుపుకుని వెళ్లడంలో ఆయన ముందు ఉండేవారిని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం ఆయన ప్రయత్నించారని తెలిపారు . నిన్న సాయంత్రం వరకు ఆ పనిలోనే ఉన్న రాజా….ఇలా గుండెపోటుతో దూరం అవ్వడం దురదృష్టకరమ‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. కోవిడ్ అనంతరం చాలా మందిలో గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని… వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి తోడు ఇతర ఒత్తిళ్లు కూడా ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. రాజా మృతికి కోవిడ్ అనంతరం సమస్యలతో పాటు…ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల ఒత్తిడికి గురవ్వడం కూడా ఒక కారణం అన్నారు. రాజాపై 12 కేసులు పెట్టారని…ఈ విషయం తనకు పలు మార్లు చెప్పుకుని ఆయన బాధపడ్డారన్నారు. ఎంపీపీగా, డీసీసీబీ ఛైర్మన్ గా, ఆప్కాబ్ వైస్ చైర్మన్ గా పనిచేసిన రాజా…మొన్నటి ఎన్నికల్లో గెలుపువరకు వచ్చారని అన్నారు. రాజా కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు.