Andhra Pradesh : చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపీకి వ‌ర్ల రామ‌య్య లేఖ‌

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపికి టీడీపీ సీనియ‌ర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి...

  • Written By:
  • Publish Date - November 25, 2022 / 10:42 AM IST

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి అధికార దుర్వినియోగంపై డీజీపికి టీడీపీ సీనియ‌ర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ప్రత్యర్థి పార్టీలను బెదిరించడం, కస్టోడియల్ టార్చర్ ఎస్పీ రిషాంత్ రెడ్డి అలవాటుగా మార్చుకున్నారరి లేఖ‌లో ఆరోపించారు. ఆయ‌న ట్రాక్ రికార్డును పరిశీలిస్తే సర్వీసు ప్రారంభం నుంచి ఆయన వైఖరి వివాదాస్పదంగానే ఉందని.. నర్సీపట్నంలో పనిచేసేటపుడు యేలేటి సంతోష్ అనే టీడీపీ కార్యకర్తకు పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి కస్టోడియల్ టార్చర్ చేశారన్నారు. ఆయన టార్చర్ భరించలేక యేలేటి సంతోష్ పోలీస్ స్టేషన్ భవనంపైనుంచి దూకేశాడని.. సంతోష్ తల్లి ఎన్ హెచ్ ఆర్సీని ఆశ్రయిస్తే 2లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆదేశించిందని వ‌ర్ల రామ‌య్య తెలిపారు. సంతోష్ కు పరిహారం ఇవ్వాలన్న ఎన్ హెచ్ఆర్సీ ఉత్తర్వులను సైతం ఎస్పీ పెడచెవిన పెట్టారని ఆరోపించారు. పోలీసులు న్యాయం చేయలేదని సంతోష్ కోర్టుకెళ్లగా, న్యాయస్థానం ఆదేశాలను సైతం పోలీసులు బేఖాతరు చేశారని.. పోలీసులు పట్టించుకోకపోవడంతో చీఫ్ సెక్రటరీ డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్సీ ఆదేశించిందని.. దీంతో భయపడి నిన్న హడావిడిగా బాధితుడికి పరిహారం ఇస్తూ పోలీసుశాఖ ఉత్తర్వులిచ్చిందన్నారు.