Site icon HashtagU Telugu

ఛీకోటి క్యాసినోపై “ఈడీ”కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య

Chikoti Praveen

Chikoti Praveen

గుడివాడ, హైదరాబాద్, ధాయ్ ల్యాండ్ అక్రమ క్యాసినోల వ్యవహారంపై ఈడీకి టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య ఫిర్యాదు చేశారు. గుడివాడ కె-కన్వెషన్ సెంటర్ లో 2022 జనవరిలో అక్రమ క్యాసినో నిర్వహించారని.. అమాయక ప్రజల నుంచి నిర్వాహకులు దాదాపు రూ.500 కోట్లు దోచుకున్నారని ఆయ‌న ఈడీకి ఫిర్యాదు చేసిన లేఖ‌లో ఆరోపించారు. గుడివాడ క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ లో సైతం అక్రమ క్యాసినో నిర్వహించారని.. చీకోటి ప్రవీణ్ ను 2022 జూలైలో హైదరాబాద్ లో ఈడీ అదుపులోకి తీసుకుందని ఆయ‌న గుర్తు చేశారు. అక్రమ క్యాసినో నిర్వహకులపై ఈడీ సమగ్ర విచారణ చేస్తున్నట్లు నాడు ప్రకటించిందని.. గుడివాడ, హైదరాబాద్ లలో అక్రమ క్యాసినో నిర్వహించిన వారే ఇటీవల ధాయ్ ల్యాండ్ లో సైతం క్యాసినో నిర్వహించి అక్కడి పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. ధాయ్ ల్యాండ్ అక్రమ క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ నుంచి దాదాపు రూ.100 కోట్లు జప్తు చేసినట్లు వార్తలు వచ్చాయని.. ఇంతటి పెద్దఎత్తున జరుగుతున్న మనీలాండరింగ్ తో జాతీయ భద్రతకు, దేశ ఆర్ధిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందన్నారు. ఈ నేపద్యంలో అక్రమ క్యాసినోల నిర్వహణలపై సమగ్ర విచారణ చేసి నేరస్తులను సంబంధిత చట్టాలతో కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నానని వ‌ర్ల రామ‌య్య ఈడీకి లేఖ రాశారు.

Exit mobile version