Site icon HashtagU Telugu

TDP : విచ్చలవిడి డ్రగ్స్, గంజాయి కారణంగానే మహిళలపై అత్యాచారాలు : వంగలపూడి అనిత

Vangalapudi Anitha Cm Jagan

Vangalapudi Anitha Cm Jagan

ఏపీలో మ‌హిళ అత్యాచారాలు డ్ర‌గ్స్‌, గంజాయి కార‌ణంగానే జ‌రుగుతున్నాయ‌ని టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత ఆరోపించారు. 17 ఏళ్ల మైనర్ దళిత బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైందని.. గతంలో రాజమండ్రిలో ఇదే రకంగా దళిత యువతి అత్యాచారానికి గురైందని ఆమె తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారని.. ఈ గ్యాంగ్ రేప్‌లో ముద్దాయిగా ఉన్న వెంకట్ ‌రెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదన్నారు. రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడిందన్నారు. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడం, కల్తీమద్యంతో మతి చెడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని అనిత ఆరోపించారు. ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే భరోసాతో వైసీపీ అనుకూల రౌడీ గ్యాంగ్‌లు పెచ్చు మీరిపోతున్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. రాష్ట్రంలోని మహిళల మాన ప్రాణాలకు రక్షణ కావాలంటే జగన్ రెడ్డిని సాగనంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలంతా అపర కాళికలై జగనాసురుడి పీడ వదిలించుకోవాలని వంగ‌ల‌పూడి అనిత కోరారు.

Also Read:  TDP : మ‌రోసారి హాట్ కామెంట్స్ చేసిన టీడీపీ ఎంపీ.. నేను దోచుకోను.. ఇంకొకరిని దోచుకోనివ్వను.. అందుకే..?