ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ ఆగ్రహం చేశారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమై…విపక్షనేతల ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలను చంపేస్తుందంటూ విమర్శించారు. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జేసీబీతో తొక్కి చంపడం రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు. వృద్ధురాలిని చంపడం వెనకున్న అధికారులను వైసీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న నిరుపేదలకు పట్టాలివ్వాలని కోరారు.
ప్రజా వేదిక ధ్వంసంతో ఆరంభమైన @ysjagan జెసిబి పాలన ప్రతిపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యం చేసుకుంది.ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలని ప్రశ్నించే ప్రజల్ని బలిగొంటోంది.విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జెసిబితో తొక్కించి చంపడం వైసిపి రాక్షస పాలనకు పరాకాష్ట pic.twitter.com/sEMHsIhI2w
— Lokesh Nara (@naralokesh) October 27, 2022
టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమాపై కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ను ఫేక్ ట్వీట్ గా ప్రకటించారు. ఇదంతా వైసీపీ ప్లానే అన్నారు. జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి వాటితో తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టాలంటూ లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి.(1/2) pic.twitter.com/w4TwNZuj7D
— Lokesh Nara (@naralokesh) October 25, 2022