Site icon HashtagU Telugu

TDP Leader Murder : టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య..!

Tdp Leader Murder

Tdp Leader Murder

ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు (Ongole ) పట్టణం మరోసారి దారుణ ఘటన(TDP Leader Murder)కు వేదికైంది. టీడీపీ అధికార ప్రతినిధి మరియు నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి(Veeraiah Chowdary)ని గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఆయన తన ఆఫీసు పద్మ టవర్స్‌లో ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరి అక్కడికక్కడే మృతి చెందారు.

Singer Pravasthi Issue : ప్రవస్తి ఆరోపణల పై సింగర్ సునీత ఏమంటుందంటే !!

హత్య తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వీరిని బిహార్ గ్యాంగ్‌కు చెందినవారిగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసును నమోదు చేసి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరిస్తోంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగుల అన్వేషణ కొనసాగుతోంది.

ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమ నేతపై జరిగిన ఈ దాడిని పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది రాజకీయ కక్షసాధింపు చర్యగా టీడీపీ భావిస్తోంది. అధికార యంత్రాంగం హత్యకు కారణమైన వారిని వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలులో భద్రతా ఏర్పాటు పెంచిన పోలీసులు, ఈ హత్య కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.