Kurnool : కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్..టీడీపీ నేత దారుణ హత్య

పత్తికొండ మండలం హోసూరులో బహిర్భూమికి వెళ్లిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులుపై దుండగులు కారం చల్లి హతమార్చారు

Published By: HashtagU Telugu Desk
Tdp Leader Killed In Kurnoo

Tdp Leader Killed In Kurnoo

కర్నూల్ (Kurnool ) జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మల్లి భగ్గుమంటున్నాయి. కేవలం కర్నూల్ అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడులు రోజు రోజుకు ఎక్కువుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా గొడవలు , అల్లర్లు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో వైసీపీ నేతలు , శ్రేణులు టీడీపీ నేతలపై దాడులు జరుపగా..ఇప్పుడు అధికారంలోకి టీడీపీ రావడం తో..టీడీపీ శ్రేణులు కూడా రెచ్చిపోతున్నారు. దెబ్బకు దెబ్బ , హత్య కు హత్యే అన్నట్లు వైసీపీ శ్రేణులకు చుక్కలు చూపిస్తూ వారిని భయం గుప్పింట్లో ఉంచుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో బహిర్భూమికి వెళ్లిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులుపై దుండగులు కారం చల్లి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు లోకేశ్ చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ తరపున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథాను మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

Read Also : Ukraine Vs Russia : రష్యాలోని 74 సెటిల్‌మెంట్లను ఆక్రమించాం.. జెలెన్ స్కీ ప్రకటన

  Last Updated: 14 Aug 2024, 09:59 AM IST