Site icon HashtagU Telugu

Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్

1 14 1507992304 26 1514232359

1 14 1507992304 26 1514232359

Kurnool Politics: టీడీపీ తనకు పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. వాస్తవానికి జిల్లాలో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్‌కు మంచి పట్టు ఉంది. అయితే కేఈ ప్రభాకర్ రాజీనామా కర్నూల్ టీడీపీని కుదిపేసింది. తన రాజీనామాతో కేఈ బ్రదర్స్ రెండు వర్గాలుగా వీడిపోయారు. అయితే ఇది కేవలం రాజకీయంగా మాత్రమే. ఇదిలా ఉండగా కేఈ ప్రభాకర్ బలం పార్టీకి వ్యతిరేకంగా కానుండటంతో ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు కేఈ ప్రభాకర్ వైసీపీ పార్టీతో టచ్ లోకి వెళ్లారట. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కర్నూల్ టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది.

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్‌ వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ప్రభాకర్ ధోనే, పత్తికొండ లేదా ఆలూరు టికెట్ ఆశించారు. ఈ ప్రతిపాదనను అనేక సందర్భాల్లో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరారు. అయితే ఒకే కుటుంబానికి ఒకే టిక్కెట్టు అంటూ చంద్రబాబు టిక్కెట్ నిరాకరించారు. పత్తికొండ టికెట్‌ను మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కే శ్యామ్‌బాబుకు టీడీపీ కేటాయించింది.

చంద్రబాబు నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రభాకర్ వైఎస్సార్సీపీకి దగ్గరయ్యాడు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలతో ప్రభాకర్‌ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా ఖరారైన వై రామయ్య స్థానంలో వైఎస్సార్‌సీపీ ప్రభాకర్ ని బరిలోకి దించేందుకు ఆసక్తిగా ఉన్నదట. అటు రామయ్య కూడా మేయర్ పదవికి ప్రాధాన్యత ఇవ్వడంతో కర్నూల్ లోకసభకి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.ఈ పరిస్థితుల్లో కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా ప్రభాకర్‌ అభ్యర్థిత్వం ఖాయమైతే.. జిల్లాలో చిరకాల ప్రాబల్యం ఉన్న కేఈ కుటుంబీకులను ఉపయోగించుకుని వైఎస్సార్‌సీపీ మైలేజ్ పెంచుకుంటుంది అంటున్నారు.

We’re now on WhatsAppClick to Join

కొన్ని దశాబ్దాలుగా కేఈ కుటుంబం ఏపీ రాజకీయాల్లో ఉంది. లోక్‌సభ స్థానంలోని మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో కేఈ ప్రభాకర్ వైఎస్సార్‌సీలోకి వెళితే అక్కడ వైసీపీకి తిరుగుండదని జగన్ కూడా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఆయన అధికార పార్టీలో చేరితే టీడీపీకి పెద్ద దెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read: Lal Bihari Vs Modi : ప్రధాని మోడీపై పోటీలో లాల్​ బిహారీ.. ఎవరో తెలుసా ?